అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు
కానీ మొరం మాత్రం పక్కదోవ పడుతుంది
రైస్ మిల్ల నిర్మాణంలో అదేవిధంగా వెంచర్ల నిర్మాణంలో తరలుతున్న మొరం
వర్ని ద్రోణ:-
జాకోర గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం తహసిల్దార్ కార్యాలయం నుంచి అనుమతులు ఇచ్చారు. జాకర గ్రామంలోని గుట్ట ప్రాంతం నుంచి మొరం మాత్రం ఇంద్రమ్మ ఇండ్లకు బదులుగా రైస్ మిల్ నిర్మాణ పనులు అదేవిధంగా వెంచర్ల నిర్మాణ పనులు భారీగా తరలు తుందని సమయం అయిదు తర్వాత కూడా అనగా రాత్రి కూడా భారీగా మొరం తరలు తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా వర్ని తాసిల్దార్ కు వివరణ కోరగా ఇందిరమ్మ ఇండ్ల కోసం రెండు రోజులపాటు అనుమతులు ఇవ్వడం జరిగిందని సమాధానం ఇచ్చారు కానీ వెంచర్లు, రైస్మిల్ల నిర్మాణంతోపాటు ఇతర ప్రైవేట్ పనుల కోసం మొరం భారీగా తరులుతుండటం పట్ల ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
