ఆగని దందా ఇసుక మొరం
స్పందనలు మాత్రం శూన్యం
అధికారుల చేతులలో ఉందా:?
ఎక్కడ చూసినా అధికారుల పేర్లు
నాకేం తెలువదు అంటూ అధికారులు
నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:- జిల్లా పరిధిలో ఎక్కడ చూసినా మొరం, ఇసుక దందా విపరీతంగా పెరిగిపోయింది అడిగిన వారిపై దౌర్జన్యాలు ఇష్టారాజ్యం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు ఒక రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇది నాదే సొత్తు అన్నట్టు ప్రవర్తిస్తూ అడిగినవారికి ఇది ఎమ్మెల్యే ఇది ఎంపీ అని చెబుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

పోలీసుల అధికారుల ముందు నుంచి వెళుతున్న సరే వాహనాలను మాత్రం పట్టించుకోవడం లేదు వాటి గురించి వ0ద కు డయల్ చేసి చెబుతుంటే మెసేజ్ లు వస్తాయి కానీ గమ్యానికి మాత్రం వారి ఇష్టం ఉన్నప్పుడు వస్తారు. ఏదీ ఎక్కడ అంటూ 100కు ఎందుకు ఫోన్ చేశారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. తాసిల్దార్లు డిప్యూటీ తాసిల్దార్లు ఎప్పుడు చూసినా బిజీబిజీ గందరగోళం ఎమ్మెల్యే వచ్చాడు రేపు మాట్లాడు అంటూ ఫోన్లు కట్ చేస్తారు. ప్రకృతి వనరులను హరింప చేస్తూ ఉంటే అక్రమాలకు అడ్డుకట్ట వేయవలసిన రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు మామూళ్ల మత్తులో ముసుగులో ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తూ పట్టించుకోకుండా తిప్పుతూ ఉంటారు.

సమాచారం కొరకు అడిగితే ఎవరికో ఫోన్లు చేసి అడిగిన వారిపై కంప్లైంట్లు ఇస్తూ వారు మాత్రం బాధ్యత అధికారిగా సక్రమంగా ఉండరు వార్తలు రాసిన విలేకరులపై మాత్రం అధికారుల దృష్టి పెంచి టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒక పని గురించి అడిగే హక్కు ప్రజలకు లేదా ప్రజలు అధికారులను ఓట్లు వేసి ఎన్నుకో లేదా అంటూ ప్రతి ఒక్కరిని నీకెందుకు అని నోరు మూపిస్తున్నారు.
