Wednesday, February 11, 2026

వ్యక్తిని కిరాతకంగా హతమార్చిన యువకులు

రెండు గంటల పాటు కారులో తిప్పుతూ…

సిగరెట్ల తో కాల్చి కత్తితో హత్య

హైదరాబాద్ ప్రతినిధి ద్రోణ:-

నాచారం ప్రాంతంలో అర్ధరాత్రి రెండు గంటలకు సరదాగా కారులో తిరుగుతున్న మహమ్మద్ జునైట్(18), షేక్ సైపుద్దీన్(18), మణికంఠ(21), మరో బాలుడు(16)ను, ఎల్బీనగర్ వద్ద లిఫ్టు అడిగిన ఉప్పల్ ప్రాంతానికి చెందిన మురళీకృష్ణ(45) అనే వ్యక్తి దారి మధ్యలో ఎన్జీఆర్ ఐ ప్రాంతంలో యువకులతో కలసి టిఫిన్ చేస్తూ ఉండగా, ఒక యువకుడిపై అనుకోకుండా చట్నీ పడింది దాంతో మురళీకృష్ణను కారులో బలవంతంగా ఎక్కించుకొని నా మీద చట్నీ పోస్తావా అంటూ, పిడుగులు గుద్దుతూ నరకం చూపించిన యువకులు రెండు గంటలపాటు కారులో తిప్పుతూ, సిగరెట్ల తో కాల్చుతూ చివరికి కత్తితో మురళీకృష్ణను పొడిచిన తర్వాత నిందితుల నుండి తప్పించుకునేందుకు కారు లో నుంచి దూకి పారిపోతూ ఉండగా, వెంబడించి మరి హతమార్చిన పోకిరి ఎదవలు మురళీకృష్ణ చనిపోయాడు అనుకుని మార్గమధ్యంలో కత్తి పడవేసి, మల్లాపూర్ కే ఎల్ రెడ్డి నగర్ ప్రాంతంలో కార్ పార్క్ చేసి పారిపోయారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి నిందితుల సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular