రాహుల్ గాంధీని కచ్చితంగా ప్రధానిగా చేయిస్తాం
హైదరాబాద్ ప్రతినిధి ద్రోణ:-
దేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తమ లక్ష్యమని గంధపు నగేష్ అన్నారు.
ఆల్ ఇండియా భారత్ జోడో సోషల్ మీడియా కన్వీనర్ గా గంధపు నాగేష్ పటేల్ నియమించారు.
నిజామాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నాగేష్ పటేల్
ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా భారత్ జోడో సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించిన రాహుల్ గాంధీ కి మరియు
మల్లికార్జున కి, ఏ ఐసీసీ సెక్రెటరీ వేణుగోపాల్, మరియు భారత్ జోడో జనరల్ సెక్రెటరీ సయ్యద్ అబ్దుల్ సామి ఆతర్ కి, ప్రత్యేకంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులలో రాహుల్ గాంధీ ని ప్రధాన ప్రధానమంత్రిని చేసి కాంగ్రెస్ పార్టీని బలోపితం చేయడానికి కష్టపడతాను అని చెప్పడం జరిగింది.
ఉన్నత విద్యాభ్యాసం చేసి కాంగ్రెస్ పార్టీ తన ఊపిరిగా ఊహ తెలిసిన అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అంటే తన కుటుంబంగా భావించి కాంగ్రెస్ పార్టీలో ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీలో ఉంటూ పార్టీ వీడకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసి బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వన్నె తేవడంలో తన వంతు కృషి అందించిన గంధపు నగేష్, 24 గంటల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తుండడం చాలా గర్వకారణం అని పలువురు అనుకోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం తన సమయం మొత్తం కేటాయిస్తూ పార్టీని బలోపేతం చేయడం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పడం సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలకు తెలపడం. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం కల్పించడంలో ఆయన చేస్తున్న కృషి అద్భుతమని ప్రజలు అనుకోవడం, అలాంటి మంచి లక్షణాలు ఉన్న గంధపు నగేష్ కు ఈ పదవి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యతనిస్తూ యువత కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క విశిష్టతను యువతకు తెలియజేసి ,రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడంలో తన వంతు కృషి చేయడం అద్భుతం అని ప్రజలు అనుకుంటున్నారు.
