Tuesday, February 10, 2026

డివిజన్ బూత్ నెంబర్ తొమ్మిదిలో పర్యటన

ఇంటింటి ప్రచారం బస్తీ ప్రజల తో ముచ్చట్లు

హైదరాబాద్ ప్రతినిధి ద్రోణ:-

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రచారంలో భాగంగా షేక్పేట్ డివిజన్లో గల బూత్ మెంబర్ తొమ్మిది లో పర్యటించి, బస్తీలోని ఇంటింటి ప్రచారం వారి సమస్యలపై అడిగే ముచ్చటించి త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇస్తూ, 11వ తేదీన జరగబోయే ఎన్నికలలో సీరియల్ నెంబర్ రేండు ఉన్న చేతి గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ ని గెలిపించి షేక్పేట్ ఇంచార్జ్ బాన్చాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడ నియోజకవర్గం లోని నాయకులు వచ్చి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మీకు ఇచ్చిన హామీలను మాత్రం తప్పకుండా నెరవేరుస్తామని ఇంతవరకు ఇచ్చిన హామీలలో కొంతవరకు అయితే నెరవేరాయని మిగతావి కూడా త్వరలోనే అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయ గౌడ్, విట్టల్ గౌడ్, చిరుతదత్తు, గంధపు దత్తు, ఉమ్మడి మండలం అధ్యక్షుడు యాదూల్, నాగనాథ్ పటేల్, నగేష్ పటేల్, ఫుల్కాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular