Wednesday, February 11, 2026

రేపే వీళ్ళ ముగ్గురి భవిష్యత్తు

జూబ్లీహిల్స్ లో జెండా పాతేది ఎవరు…..?

నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణమిది అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఉదయం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, బోటానికల్ గార్డెన్ లో ఎన్నికల సామాగ్రిని పోలింగ్ సిబ్బందికి అప్పగించారు. పోలింగ్ మంగళవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, గత ఎన్నికలతో పోలిస్తే గంట సమయం ఆదనంగా ఉంది నియోజకవర్గ పరిధిలో మొత్తం నాలుగు లక్షలకు పైగా ఓటర్లు నూట ముప్పై తొమ్మిది ప్రాంతాలలో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 58 మంది బరిలో ఉన్నారు డిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాత్ మరణంతో ఖాళీ అయిన స్థానం భర్తీ కోసం నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సర్వం సిద్ధం జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసి ఉప ఎన్నికలలో నాలుగు లక్షల ఒక వెయ్యి 365 మంది ఓటర్లు అర్హులుగా ఉన్నారు వారిలో రెండు లక్షల 8 వేళ 561 మంది పురుషులు ఒక లక్ష 92 వేల 77 9 మంది మహిళలు 25 మంది ఇతరులు ఉన్నారు నియోజకవర్గంలో 18 మంది సర్వీస్ ఓటర్లు 123 మంది విదేశీ ఓటర్లు ఉన్నారు మొత్తం 1,908 మంది ఓటర్లు వికలాంగులు, 6,859 మంది 18 నుండి 19 సంవత్సరాల వయస్సు గల మొదటిసారి ఓటర్లు ఉన్నారు 85 ఏళ్లు పైబడిన వారు సీనియర్ పౌరుల సంఖ్య 2,134 మంది 139 భవనాలలో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఒక్కొక్క కేంద్రానికి 986 ఓటర్లు ఉన్నారు అత్యధిక సంఖ్యలో ఓటర్ల పోలింగ్ కేంద్రం నెంబర్ 9 లో 1233 మంది ఉండగా. … అత్యల్పంగా పోలింగ్ కేంద్రంలో నెంబర్ 263 లో 540 మంది మాత్రమే ఉన్నారు 11 పోలింగ్ కేంద్రాలలో 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular