ఇష్టారాజ్యం వచ్చినట్లు వెళ్తారా
బోధన్ ద్రోణ:-రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం నుంచి ఓ వ్యక్తి ట్రాక్టర్ కు కలప తీసుకెళుతూ ఉంటే వెనుక నుంచి వాహనాలు వస్తూపోతూ ఉన్నాయి. లారీలు ఓవర్ లోడ్ ల గురించి పట్టించుకోకుండా ఆర్టీవోలు, పోలీసులు మాత్రం

ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా బైకు తనిఖీలపై మాత్రం దృష్టి పెట్టి డ్రింక్ అండ్ డ్రైవ్, లైసెన్సులు పై హెల్మెట్లపై దృష్టి పెడుతూ ఓవర్ లోడ్లను పట్టించుకోకుండా లారీలను వదిలేస్తూ ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో తెలవకుండా నిమ్మకు నీరెత్తినట్టు అడిగిన వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారు. కనీసం ఒక లారీ ఓవర్ లోడ్ తో వెళుతున్నప్పుడు పక్కనున్న పోలీస్ కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఎన్నో ప్రమాదాలకు గురి చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస బాధ్యతగా కలపను ట్రక్కులో వేసుకొని వెళ్లాలి అన్న అంకిత జ్ఞానం కూడా లేకుండా ట్రాక్టర్ కు తాడు కట్టి లాక్కెళ్ళడం ప్రతి ఒక్కరు చోద్యం చూసినట్టు చూస్తున్నారు.

అలాంటి టాక్టరు ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు దానికి కనీస ఫిట్నెస్ ఉందా లేదా అని కూడా అడగకుండా వదిలేస్తున్నారు. అసలు గుట్టలు కలపను ఇష్ట రాజ్యం ఉన్నట్లు అభివృద్ధి పేర్లతో తువ్వేస్తున్న పట్టించుకోరు. అడిగినవారికి బడా నేతల పేర్లు చెబుతూ నీకేం సంబంధం అంటూ బెదిరిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా గుట్టలను తవ్వేస్తూ ఇసుక మాఫియా కూడా ప్రకృతి వనరులపై ఈ విధంగా దోచుకునే వాడిదే రాజ్యం అంటూ వ్యవహరిస్తున్నారు.
