పలువురిపై కేసులు నమోదు
ఇసుక అనుమతులపై చెలరేగుతున్న వివాదాలు
ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతంగల్ తాసిల్దార్ గంగాధర్ ఇసుక రవాణాకు అనుమతులను ఇచ్చారు. ఇట్టి అనుమతులపై పోతంగల్ గ్రామస్తులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఇసుక అనుమతులపై గ్రామస్తులకు సముదాయించేందుకు కోటగిరి పోలీసులు, తహసిల్దార్ తమవంతు ప్రయత్నాలు చేశారు. గ్రామానికి చెందిన కొందరు భీష్మించి ఇసుక లారీలను సోమవారం అడ్డుకున్నారు. అధికారులు శతవిధాల ప్రయత్నాలు చేసినప్పటికీ గ్రామానికి చెందిన కొందరు అధికారులకు సైతం లెక్కచేయకుండా ఇసుక లారీలను ఖాళీ చేయించారు.
పోతంగల్ ఎమ్మార్వో డబుల్ బెడ్ రూమ్ లకు ఇసుక రవాణా గురించి టిప్పర్లకు అనుమతి ఇచ్చి వే బిల్లు ఇచ్చినారు, అట్టి టిప్పర్లను పోతంగల్ గ్రామానికి చెందిన పబ్బ శేఖర్, కేశ వీరేశం, షేక్ యాదుల్, సూదం నవీన్, గంట్ల శ్రీను, కొట్టాల గంగాధర్, తాజుద్దీన్ ఖురేషి, పబ్బ అనిల్, గంధపు మోహన్,చెన్నప్ప సాగర్, బూర బోయిన గంగాధర్, వీరేశం అనేవారు అడ్డుకున్నారు, మరియు వారు రెవెన్యూ సిబ్బంది పై దౌర్జన్యం చేసి అడ్డుకొని వారి విధులకు ఆటంకపరిచినారు అని షేక్ ముజాహిద్ జూనియర్ అసిస్టెంట్ పోతంగల్ ఎంఆర్ఓ ఆఫీస్ అనే వ్యక్తి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు.
ఇసుక రగడ షురూ
పోతంగల్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రతినిత్యం అక్రమ ఇసుక రవాణా కొనసాగించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట అధికారులు అనుమతులు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి పెద్ద ఎత్తున ఇసుక తరలించుతున్నారని గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇసుక లారీలను అడ్డుకున్నారు. కొడచర్ల గ్రామానికి చెందిన కొందరి రైతుల వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు ఉన్నట్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వ్యవసాయదారుల పేరిట ఇసుక అనుమతులు పొంది పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తూ లక్షలాది రూపాయలు జేబులు నింపుకుంటున్నారని గ్రామస్తులు కొందరు ఆరోపించారు. ప్రభుత్వం ఇసుక అనుమతులు ఇచ్చిన ప్రదేశం నుండి కాకుండా మంజీరా నదిలో నుండి అక్రమంగా ఇసుకను రవాణా చేసి నిల్వలు చేయడం పట్ల గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పోతంగల్ గ్రామానికి చెందిన వ్యక్తులే అక్రమ రవాణాకు తెరలేపేరంటూ గ్రామస్తులు ముక్త కంఠముతో నినదించారు. ఇలా అక్రమ రవాణా ఎన్నేళ్లు చేస్తారంటూ పోతంగల్ గ్రామంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇసుక రవాణా తో గ్రామాల్లో ప్రజలు గ్రూపులుగా ఏర్పడి వివాదాలకు తెర లేపుతున్నారు. గ్రామానికి సమీపంలో మంజీరా నది ఉండడం నదిలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు పేరుకుపోవడంతో పోతంగల్ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు వ్యాపారంగా మరలచుకొని లక్షలాది రూపాయలు జేబులింపుకోవడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇసుక రవాణా పట్ల అధికారులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెవెన్యూ అధికారులు పొతంగల్ గ్రామం పేరిట ఇసుక రవాణా చేసేందుకు ప్రతినిత్యం అనుమతులు ఇస్తున్నారు. పోతంగల్ అనుమతుల పేరిట కొడిచెర్ల గ్రామ శివారులోని మంజీరా నది నుండి ప్రతినిత్యం అక్రమార్కులు ఇసుక రవాణాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కొడిచెర్ల, పోతంగల్ గ్రామాల ప్రజల మధ్య ఎన్నోమార్లు వివాదాలు కొనసాగాయి. ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగడంతో కొన్ని సందర్భాల్లో ఇరుగు గ్రామాల ప్రజలు సయోధ్య కుదుర్చుకుంటున్నారు.
