Wednesday, February 11, 2026

జాగృతి వైపే జనం బాట

రిజర్వాయర్లు సందర్శించిన కవిత

కిష్టారాయినిపల్లి, శివన్న గూడెం రిజర్వాయర్ల నిర్వాసితులతో సమావేశం

తమ గోడును చెప్పుకుంటూ కన్నీళ్ల పర్వమైన బాధితులు

అండగా ఉంటానని భరోసా ఇచ్చిన కవిత

నల్గొండ ప్రతినిధి ద్రోణ:-

డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే వేలాదిమందికి లాభం చేకూరుతుందని ఆ ఉద్దేశంతో ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రజలు పెద్ద మనసు చేసుకొని

తమ భూములను 2015 లోనే ఇచ్చి తొందరగా ప్రాజెక్టును పూర్తి అయ్యేటట్లు చూసినట్లయితే సమస్యలు ఉండకపోయేవి, దాదాపు 11 ఏళ్ల ఆలస్యమైంది.

దాంతో అప్పుడు 18 ఏళ్ల నిండని చాలామందికి ఇప్పుడు 18 ఏళ్లు దాటాయి. వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ అప్పుడు ఉన్న ధరలను ఇప్పుడు ఉన్న ధరలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుందని అంతేకాకుండా నిర్వాసితులకు ఇల్లు గానీ వేరే కాలనీలు గాని కట్టించాలి.

ప్రజలను వారికి కట్టించిన ఇళ్లల్లో వారిని ఉంచి నెలనెలా ఖర్చులకు ఇవ్వాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు. ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇక్కడిదాకా వచ్చానని గతంలో మునుగోడు ఎన్నికలు జరిపినప్పుడు ప్రపంచం మొత్తం ఆ ఎన్నికల గురించి మాట్లాడుకుంది.

అంత పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఖర్చు పెట్టినంత అప్పటిలోనే న్యాయం చేస్తానని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట ఇచ్చాడు. ఇప్పుడు మాత్రం అడిగితే తప్పించుకుని తిరుగుతున్నాడని ప్రస్తుత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి మిడ్ మానేర్ కు కట్టినప్పుడు కేటీఆర్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ కట్టిన సమయంలో కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసినట్లు చేస్తానని బూటకపు మాటలు చెప్పి వారి స్వార్థం చూసుకున్నారు. ఉదయం సముద్రం, శివన్న గూడెం, కిష్టారంపాలెం, లక్ష్మణపురం ప్రజలకు. …. ఒక ఎకరాకు 25 లక్షలు ఇప్పిస్తానని ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన కూడా పట్టించుకోవడం లేదు. అంశాలపై ప్రభుత్వాన్ని పదేపదే అడిగి ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను మేము రావడం కారణంగా మీకు రెండు రూపాయలు లాభమైన నా జన్మ ధన్యమైనట్లే అని అక్కడకు వచ్చిన కాంట్రాక్టర్లతో మాట్లాడారు.

నాలుగు నెలలుగా వాళ్లకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదంట కట్ట పోసుడు బంద్ పెట్టామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది అని ఆ లోపల మనం ఇళ్ల జాగాలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది అని కొంతమంది ఇబ్రహీంపట్నం మరి కొంత మంది చింతలపల్లిలో ల్యాండ్ కావాలని అడిగారు. ఈ అంశానికి సంబంధించి ఒక తారీకు పెట్టుకుని నల్గొండలో లేదంటే హైదరాబాదులో మనం ప్రభుత్వాన్ని నిలదీయాలని అయితేనే పనులు అయ్యే పరిస్థితి ఉందని దిండి పరివాహక ప్రాంతంలో పనులు ఆగిపోయి ఇంకా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని ఆలస్యం చేసే కొద్దీ నష్టం ఎక్కువగా అవుతుందని ఇంతవరకు రైతులుగా ఉన్నవారు.

కూలీలుగా మారారని బాధతో చెప్పుకున్నారు ఇక కూలీలు ఏమైపోయారో తెలియని పరిస్థితి ఊరంతా ఎత్తిపోతుంది ప్రభుత్వం తీరు కరెక్ట్ లేక బాధితులకు న్యాయం చేయ లేకుంటే వెంటనే వారికి పరిహారం ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ యువతతో కలిసి హైదరాబాదులో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణ కోసం పాలు పడతానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular