Wednesday, February 11, 2026

దేశాల ఆర్థిక స్థితిగతులను దెబ్బతీయడానికి ట్రంప్ ప్రయత్నం

ఎగుమతులు దిగుమతులపై అధిక సుంకాలు విధించడం సరికాదు

చరిత్రలో నిలిచే సిపిఐ శత జయంతి ఉత్సవ కార్యక్రమం విజయ వంతం చేద్దాం

జిల్లా కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యురాలు పశ్యపద్మ
దేశాల ఆర్థిక స్థితిగతులను దెబ్బతీయడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారని, ఎగుమతులు దిగుమతులపై అధిక సుంకాలు విధించడం సరికాదని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్యపద్మ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా సిపిఐ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజేశ్వర్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా సిపిఐ కార్యదర్శి వర్గసభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర నాయకులు కంజర.భూమయ్య
సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య పాల్గొన్నారు. ఈ జిల్లా కౌన్సిన్ ను ఉద్దేశించి పశ్యపద్మ మాట్లాడుతూ… డిసెంబర్ 26న సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని, అందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. చరిత్రలో నిలిచే సిపిఐ శత జయంతి ఉత్సవ కార్యక్రమం విజయ వంతం చేద్దామని పిలుపు నిచ్చారు.
మెక్ అమెరికా బిగ్ అగైన్ అని అతిపెద్ద సంపద గల దేశంగా మార్చుకోవడంలో భాగంగా ఎగుమతులు దిగుమతులను పెంచుతూ ట్రంప్ కుట్ర చేస్తున్నారన్నారు. అమెరికా
దేశ ఆర్థిక స్థితి గతులను పెంచేలా చేస్తున్నారు. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయ బద్దగా లేకపోవడంతో పాటు వివిధ దేశాల సార్వభౌమాధికారాన్నిదెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారన్నారు.. రష్యా నుంచి దిగుమతి అవుతున్న క్రూడాయిల్ కు సంబంధించి వెంటనే ఆపాలని లేదా25 శాతం అదనంగా సుంకాలు వసూలు చేస్తామని బెదిరింపులకు అనుకుంటున్నాడు. రష్యా నుంచి ఆయిల్ ను దిగుమతి చేసుకోమని మోడీ గారు తనతో చెప్పినట్లుగా ప్రకటనలను గుప్పిస్తున్నాడు. ఈ ప్రకటనల పట్ల మోడీ మౌనం వహించడం ఏంటని ప్రశ్నించారు. బిజెపి అవలంబిస్తున్న తీరుపై ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రజా పోరాటాలు, సిపిఐ సాధించిన విజయాల గురించి చర్చించగలిగె ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.

కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఉంటుందని అన్నారు.
నవంబర్ 18న మైనారిటీలపై దళిత లోనై మహిళల పై జరుగుతున్న దారుణమైన హత్యలు దాడులను నిరసిస్తూ కార్యక్రమం చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపుని విజయవంతం చేయాలని కోరారు. ఈ కౌన్సిల్ సమావేశంలో బి రఘురాం, బొంబాయి గంగారం,కే గంగామణి, ఎం సాయిలు, ఎన్ సాయిలు, అనిల్, హనుమాన్లు, ఆలీ ఇమ్రాన్, కే ప్రసాద్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular