Wednesday, February 11, 2026

అస్తవ్యస్తంగా చెత్తాచెదరం


ప్రధాన రహదారి పక్కనే చెత్తాచెదారం


రుద్రూర్ ద్రోణ:-

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రం నుంచి బస్టాండ్ ప్రాంగణం నుంచి కోటగిరి వెళ్లే ప్రధాన రహదారి ఒక కాల్వ పక్కనే చెత్త చదరం కుళ్ళు పదార్థాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని వాహనాల రాకపోకలకు అదే విధంగా ప్రయాణికుల రాకపోకలలో భాగంగా దుర్వాసన రావడం మే కాకుండా చెత్తాచెదరం ఆటంకం కల్పిస్తుందని దీనిపై చర్యలు తీసుకునే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది దుకాణ సముదాయం వారు ఇష్టానుసారంగా తమ యొక్క వస్తువులను రోడ్డు పక్కనే ఉంచడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు పైనుంచి వెళ్లే వాహన పదాలకు ప్రయాణికులకు ఈ అస్తవ్యస్తమైన వస్తువులు అంతరయం కల్పిస్తుందని దీనిపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular