తాసిల్దార్ గంగాధర్

ఎస్సై సునీల్ మాపై అక్రమ కేసులు
జల్లపల్లి ,కొడిచెర్ల వివిధ గ్రామాల్లో ప్రభుత్వ భూములు అక్రమ పట్టాలు చేసిన అధికారుల చిత్తా మా దగ్గర ఉంది
మాపై అక్రమ కేసులు పెడతారా మీ చిత్త మా వద్ద ఉంది బయట పెడతాం
మాపై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకుంటే సరే లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తప్పవు

మాకు దో నంబర్ దందాలు లేవు అక్రమ వ్యాపారాలు లేవు ప్రజల్లో ఉంటాం ప్రజల కోసం కృషి చేస్తాం
అక్రమ కేసులు పెట్టి భయపెట్టిస్తామంటే ఊరుకోం తగిన గుణపాఠం చెబుతాం
ఏళ్లు గడుస్తున్నాయి మాకు తాసిల్దారు ఇవ్వరా
అక్రమంగా ఇసుక తరలుతుంది ఓవర్ లోడ్ తో ఇసుక తగులుతుంది

ఎన్నిసార్లు చెప్పినా అక్రమ దారులకు కొమ్ము కాషారు
అక్రమ ఇసుక వ్యాపారాన్ని ఆపకపోవడంతో రైతులు వెళ్లి ఆపారు
అక్రమ ఇసుకపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి భయపెట్టిస్తారా ,వేధింపులు చేస్తారా సహించేది లేదు

మీ అవినీతి అక్రమాల చిట్టా బయట తీస్తాం అంతా మా వద్ద ఉంది
పొతంగల్ ద్రోణ:-
కోటగిరి తాసిల్దార్ గంగాధర్, ఎస్సై సునీల్ తమపై అక్రమ కేసులు పెట్టారు. అక్రమ ఇసుక తరలుతుంటే ,ఓవర్ లోడ్ తో ఇసుక తరలుతుంటే ,తాము ప్రశ్నిస్తే, రైతులు అని చూడకుండా ,ప్రశ్నించిన వారిపై, అక్రమ కేసులు పెట్టి భయపెట్టిస్తారా, భయపెట్టిచ్చినంత మాత్రాన , తాము భయపడమని అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన ఆందోళనలు ఉదృతం చేస్తామని, పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని అవినీతి అక్రమాల చిట్టా మా వద్ద ఉన్నాయని ,బయట పెడతామని, నాయకులు ,ప్రజలు ,రైతులు పబ్బా శేఖర్ , యాధులు ,నవీన్ తో పాటు పలువురు పొతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా మందిర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జల్లపల్లి గ్రామంతో పాటు కొడిచెర్ల గ్రామం తో పాటు పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములను అక్రమ పట్టాలు చేసి లంచం తీసుకున్న అవినీతి అక్రమాల చిట్టా మా దగ్గర ఉన్నాయని భయపెట్టిస్తే భయపడమని మీ యొక్క అక్రమ చిట్టాలు బయట తీయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు చేశారు.

కొడిచెర్ల గ్రామం మంజీర శివారు ప్రాంతంలో ఓ రైతు తన పొలం అభివృద్ధి పేరుతో అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుకను తరలిస్తానని పర్మిషన్లు తెచ్చి పర్మిషన్ పేరుతో అక్రమ ఇసుక వ్యాపారం జరుగుతుందని, అంతేకాకుండా 334 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి అనగా సుమారు 500 ఎకరాల భూములలో అక్రమంగా ఇసుకను త్రవ్వకాలు చేసి డంపు చేసి అక్రమంగా ఓవర్ లోడుతో ప్రతిరోజు తరలిస్తుంటే ఈ విషయం స్థానిక అధికారులకు అదేవిధంగా తాసిల్దార్ గంగాధర్ కామ్రేకు చెప్పిన పట్టించుకోకపోవడంతో సోమవారం అంగడి రోజు కావడంతో రైతులు ఇసుక టిప్పర్ ను ఆపి, అక్రమ ఇసుక వ్యాపారని ఆపాలని కోరటం తో పాటు ఇలా అక్రమ ఇసుక తరలింపులు చేయడం. ఎంత వరకు అని ప్రశ్నించగా, రైతులు గ్రామ ప్రజలు అని చూడకుండా సుమారు 12 మంది పై అక్రమ కేసులు పెట్టడం విడ్డూరం అని మండిపడ్డారు.

జూనియర్ అసిస్టెంట్ ముజాహిద్ అక్కడ లేకున్నప్పటికీ దీనిపై ఎటువంటి సంబంధాలు లేకున్నా ఆయనతో ఫిర్యాదు పెట్టించుకుని ఎమ్మార్వో ,ఎస్సైలు అక్రమ కేసులు ఏ విధంగా పెడతారు అని వారు ప్రశ్నించారు. కొంతమంది చేపల కర్రీ ఇతర లాలుచిలు చూపించి అవసరమైతే ఇతర అమన్యాలు ఇచ్చి వారికి కొమ్ముకాస్తూ అమాయకులపై రైతులపై అక్రమ కేసులు పెడితే ఊరుకుంటామా, చట్టపరంగా వెళ్తామని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఆందోళన చేస్తామని హెచ్చరికలు చేశారు, పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరికలు చేశారు. పొతంగల్ తో పాటు ఇతర మంజీరా నదుల నుంచి ప్రతి రోజు పగలు రాత్రి అని తేడా లేకుండా మహారాష్ట్రకు ట్రాక్టర్ల ద్వారా ఇతర వాహనాల ద్వారా ఇసుక తల్లుతుందని వీటిని అరికట్టవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి కొంతమందికి కొమ్ముకాస్తూ అమన్యాలకు ఆశపడి వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని వీటి పై రైతులు ప్రజలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ ఇబ్బంది పలు చేయడం.

మనకి వాల్టా చట్టం అనేది ఉందని అధికారులకు మరియు రాజకీయ నాయకులకు అవగాహన ఎంతవరకు ఉంది అని ఇప్పటికైనా తెలుసా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఆ చట్టం యొక్క నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ రకంగా వ్యాపారాలతో దేశాన్ని కొల్లగొడుతూ ఉన్నారు. మీ యొక్క వైఖరిని మార్చుకోవాలని లేనిపక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరికలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు రైతులు ఉన్నారు.
