హైదరాబాద్ ద్రోణ:- తన సమీప అభ్యర్థిపై(బీ ఆర్ ఎస్) పార్టీకి చెందిన మాగంటి సునీత పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమై అయినప్పటి నుంచి నవీన్ యాదవ్ కు రౌండ్ రౌండ్ కు అనుకోని మెజారిటీ అధికంగా పెరుగుతూనే ఉంది ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాగంటి సునీత పై 25 వేల ఓట్ల కు పైగా మెజార్టీతో అత్యధిక గెలుపు సాధించడం.

సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కు కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది దీంతో గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మరో సారి వారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే హక్కును కల్పించింది. టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా…బిజెపి డిపాజిట్ కూడా గల్లంతయింది.
