ప్రభుత్వ సలహాదారుడు పి. సుదర్శన్ రెడ్డి

ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళల ఆత్మగౌరవం
నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇంద్రమ్మ చీరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారుడు పి సుదర్శన్ రెడ్డి గ్రామీణ ప్రాంత మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ అట్టహాసంగా నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ లో ప్రారంభించారు.

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత ఆయన చేతుల మీదుగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో ఆకర్షణీయంగా, నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేయడం. మహిళల పట్ల సమైక్య ప్రతి నిధులు హర్షం వెల్లబుచ్చారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ప్రభుత్వం తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక, సామాజిక ప్రగతిని చాటాలని మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే

ఈతసారి నాణ్యమైన చీరలను తయారు చేయించిందని గత ప్రభుత్వం సహాయం లో నాసిరకం చీరలను అందించారని విమర్శలు చేశారు. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా, తప్పిదాలు, లోటుపాట్లకు తావు లేకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు, ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాలకు సరిపడా చీరలను పంపిణీ చేసిందని, అవసరమైన జిల్లాలకు మరిన్ని చీరలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని, అర్హులైన ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా, అధికారులు

పంపిణీ చేయాలని కుటుంబ మహిళలే కీలకమని, భవిష్యత్తు తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని ఇతవు పలికి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వైపు పిల్లలు పెడదారి పట్టకుండా కాపాడుకోవాలని, నిపుణులైన ఉపాధ్యాయులు, సదుపాయాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించాలని మంచి ఆహారం అలవాట్లతో ఆరోగ్యాలను కాపాడుకుంటూ రసాయనిక మందులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో పందిరి కూరగాయలను సాగు వంటివి చేపట్టుకుంటూ ముందుకు వచ్చే మహిళా సంఘాలు, సమైక్యలకు ప్రభుత్వపరంగా మరింత ప్రోత్సాహం అందిస్తుందని హితవు పలికారు.

కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇంద్రమ్మ చీరలు అందించాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలలో చీరల పంపిణీ అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం గ్రామీణ ప్రాంత మహిళలకు తొలివిడతలో చీరలను పంపిణీ చేస్తుందని, పట్టణ ప్రాంతాలలో మార్చి ఒకటవ తేదీ నుండి వారం రోజులపాటు చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వాటిని ప్రభుత్వం మహిళల పేర్లతోనే మంజూరు చేస్తుందని, మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని వడ్డీ లేని రుణాలు అందించడమే కాకుండా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాయతీపై 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి కోసం తోడ్పాటును అందిస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వం మహిళలు సమిష్టిగా ఉంటూ తమ వ్యాపార కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వ సంకల్పాన్ని నిరూపితం చేయాలని ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఇందిరమ్మ చీరలు ఎంతో నాణ్యతతో కూడుకొని ఉన్నాయని అర్హులైన వారందరికీ చీరల పంపిణీ జరిగేలా పక్కాగా అధికారుల పర్యవేక్షణలో జరిగేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హంధాన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డి. ఆర్. డి. ఓ సాయ గౌడ్, నిజామాబాద్ ఆర్డిఓ రాజేందర్ కుమార్, మహిళా సమైక్య ప్రతినిధులు సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
