Wednesday, February 11, 2026

పీఎం శ్రీ నిధులు దుర్వినియోగం కాలేదు

తనపై నిరాదన ఆరోపణలు చేస్తున్నారు

బోధన్ టౌన్ ద్రోణ:- చందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ నిధులు దుర్వినియోగం కాలేదని తనపై నిరాధన ఆరోపణలు చేస్తున్నారని ఎం ఈ ఓ , కాంప్లెక్స్ హెడ్మాస్టర్, ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ ఏ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చందూరు మండల ప్రభుత్వ పాఠశాలలో ఎం ఈ ఓ అదే విధంగా హెడ్మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడడం జరిగింది.(2024___ 25) సంవత్సరం గాను పీఎం శ్రీ పథకం కింద (17,83,280) పది హేడు లక్షల ఎనబై మూడు వేల రేండు వందల ఎనభై రూపాయలు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు, అందులో పదకొడు లక్షల తోబై నాలుగు వేల పద్దెనిమిది రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మిగతా ఐదు లక్షల ఎనబై ఎనిమిది వేల ఐదు వందలు రూపాయలు నాతోపాటు ఉపాధ్యాయులు మురళీ, మోహన్, రాములు, మహేష్ నలుగురి పేర్ల పై, ఒక ఉపాధ్యాయుని పేరుపై ఏనుబై ఐదు వేలు మరొక ఉపాధ్యాయుని పేరు పై రెండు లక్షల తోబై వేల ఐదు వందలు రూపాయలు. మరొక ఉపాధ్యాయుని పేరు పై యాబై వేల రూపాయలు.

నా అకౌంట్ లో రెండు లక్షల ముపై నాలుగు వేల రూపాయలు నిలువ ఉన్నట్టు పేర్కొన్నారు. నలుగురి అకౌంట్ లో నిధులు అలాగే ఉన్నాయని. ఖర్చు పెట్టడంలో ఆలస్యం జరిగిందని అన్నారు. తనతోపాటు పాటు మురళీమోహన్రావు అనే ఉపాధ్యాయుడు రాములు ,మహేష్ అని ఉపాధ్యాయుల పేరుపై నిధులు జమ అయి ఉన్నాయని అన్నారు. ఆ నిధులు ఖర్చు పెట్టలేదని జమాయి ఉన్నాయని అలాంటప్పుడు తాము నిధులు స్వాహా లేక దుర్వినియోగం ఎలా చేసినట్టు అవుతుందని అన్నారు.(2024,,,,, 25) సంవత్సరంలో ఈ నిధులు అనగా ఫైనాన్స్యల్ ఇయర్ ఎండింగ్ కి రావడం జరగడం వలన, ఖర్చు పెట్టడానికి టైం లేకపోవడం, వర్షాలు రావడం ఇతర కారణాలవల్ల ఖర్చు చేయలేకపోయామని పేర్కొన్నారు. కావాలని కొంతమంది ఉపాధ్యాయులు నాపై ఆరోపణలు చేయడం బాధగా ఉందని అన్నారు. తాను ఒక హెడ్మాస్టర్ గా కాకుండా కాంప్లెక్స్ హెడ్మాస్టర్ గా ఉన్నానని ఎంఈఓ బాధ్యతలు చేపడుతున్నానని అందుకే ఆలస్యం జరిగిందని అన్నారు. నిధులు ఆలస్యంగా వచ్చి ఉన్నాయని ఖర్చు చేసే విషయంలో డిఈఓ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందని డీఈవో నుంచి సమాధానం రాకపోవడం కూడా ఆలస్యం అయిందని అన్నారు. గ్రామ పెద్దలు, గ్రామస్తులు వెళ్లి గరం అయినా పరిస్థితి నిధుల దుర్వినియోగం విషయంలో న్యూస్ పేపర్లలో రావడం , పై ఆఫీసులకు కొంతమంది ఉపాధ్యాయులు కంప్లైంట్ చేయడం హల్ చల్ సంఘటన జరగడంతో, గ్రామ పెద్దలు గ్రామ మాజీ సర్పంచ్ కర్ణం సాయి రెడ్డి తో పాటు పలువురు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుల తీరు పై తీవ్రంగా ఆ గ్రామం చేయటం జరిగిందని సమాచారం. ఉపాధ్యాయుల మధ్య సఖ్యత లేకపోవడం వల్లన ఇలా జరుగుతుందని వారి తీరుపై గరం అయినట్టు సమాచారం. గ్రామస్తులు పాఠశాల అభివృద్ధి కోసం పిల్లల సంఖ్య పెంచడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారని వారి సహకారం చాలా గొప్పదని పలువురు అంటున్నవేళ ఉపాధ్యాయుల మధ్య ఐక్యమత్యం లేకపోవడం పాఠశాల బదనామవుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ హెడ్మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి బాగానే పనిచేస్తున్నారని, నిధులు స్వా చేసేంత కర్మ ఆయనకు పట్టలేదని గతంలో రిపేరుకు సంబంధించిన డెబై వేల రూపాయలు అలాగే జమ చేసి పెట్టి ఖర్చు పెట్టలేదని తోటి ఉపాధ్యాయులు కొంతమంది ఖర్చు చేయమన్నా ఖర్చు చేయడం లేదని, మినరల్ వాటర్ కోసం ఖర్చు చేయాలని కొంతమంది ఒత్తిడి చేస్తే కూడా ఖర్చు పెట్టలే అయితే గ్రామ పెద్దలంతా కలిసి మినరల్ వాటర్ సౌకర్యం దాతల సహకారంతో పిల్లలకు చేపట్టడం జరిగిందని పలువురు చెబుతున్నారు. అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాస్ రెడ్డిని కొంతమంది ఉపాధ్యాయులు కావాలని బద్నం చేస్తున్నారని, బద్నాం చేసే ఉపాధ్యాయుల తీరుపై భగ్గుమన్నారని, నిరాధన ఆరోపణలతో పాఠశాలకు బద్ధం చేసేది ఉంటే వెళ్లిపోండి అంటూ గ్రామస్తులు హెచ్చరించినట్టు తెలిసింది. ఏది ఏమైనా హెడ్మాస్టర్ ఎంఈఓ తీరు బాగానే ఉందని గ్రామస్తులు గమనించి ఆయనకు అభినందనలు తెలియజేశారు.

ఖాళీలు ఇలా ఉన్నాయి

చందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఇంకా కావాల్సి ఉందని డ్రాయింగ్ టీచర్ కావాల్సి ఉందని ఆఫీస్ సబార్డునెంట్ తో పాటు నైట్ వాక్మెన్ ఇంకా కావాల్సి ఉందని చెప్తున్నారు. మొత్తం పాఠశాలలో పదహరు మంది స్టాప్ ఉన్నట్టు పేర్కొంటున్నారు. పాఠశాలలో మొత్తం మూడు వందల అరవై నాలుగు మంది విద్యార్థులు ఉండగా పదవ తరగతిలో ఆరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు.తోమిదవ వ తరగతిలో ఎనబై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు. గత పదవ తరగతి రిజల్ట్ లో తోబై మూడు (93) % ఉత్తీర్ణత పాఠశాల సాధించిన ఘనత ఉందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సకల సౌకర్యాలతో ఓపెన్ ప్లేస్ లో అన్ని హంగులాలతో ప్రైవేట్ పాఠశాల దీటుగా ఉన్న చందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలపై కావాలని ఆరోపణలు చేస్తే సహించేది లేదని గ్రామస్తులు అంటున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు లేనిపోని రాద్ధాంతం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఇలా పనిచేస్తే ఖబర్దార్ అని గ్రామస్తులు హెచ్చరించినట్లు. ఐక్యమత్య లోపం స్వార్థం గ్రామానికి చెడ్డపేరు తేవద్దని ,గ్రామంలో పిల్లలకు పేద పిల్లలకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరికలు చేశారు.

చందూరులో జరిగింది ఇది


పి ఎం శ్రీ పథకం కింద చందూర్ హై స్కూల్ కు వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై జిల్లా విద్యాశాఖ అధికారులు గురువారం విచారణ చేపట్టారు. గత ఏడాది పాఠశాలకు వచ్చిన నిధులను నిబంధనల ప్రకారం ఖర్చు చేయలేదని ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. పథకం నియమ నిబంధనల ప్రకారం నిధులను వినియోగించలేదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించి, తక్కువ నిధులు ఖర్చు చేసి సవ్యంగా ఖర్చు చేసినట్లు రికార్డులు చూపించి నిధులను కాజేశారని ఆరోపణలు రావడంతో జిల్లా అధికారులు విచారణ చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular