స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా బి ఫామ్ ను ఏనుగు రవీందర్ రెడ్డి కి రావాలి
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధినేత
షేక్పేట్ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డికే దక్కింది
కోటగిరి ద్రోణ:-
ఇచ్చిన హామీలను మాత్రం దృష్టి లో పెట్టుకొని నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ పార్టీపై పట్టును సాధిస్తూ ప్రజల నీరాజనాలు అందుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనే నెంబర్ వన్ అనే స్థాయిలో ఉన్నారని ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి అమలు అయ్యే విధంగా చూస్తూ ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునే ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారు.

కోటిగిరి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి ఎంఎ వాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చిన ఘనత ఉందని త్వరలోనే ఇంద్రమ్మ చీరలు పంపిణీ కి సిద్ధమవుతున్నామని అన్నారు ఇంద్రమ్మ ఇల్లులు ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మైనార్టీలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని మైనార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని ఉన్నారు. రానున్న స్థానిక ఎలక్షన్ లో అన్ని స్థానాలు కైవసం చేసుకునేందుకు జనంలో ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గెలుపుకు ప్రధాన కారణం అవుతాయని ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవిని కైవసం చేసుకోవడంలో షేక్పేట్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కృషి అద్భుతంగా ఉందని చెప్పారు.

బాన్సువాడ నియోజకవర్గం లో రానున్న ఎలక్షన్ లో మాజీ ఎమ్మెల్యేగా గుర్తించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా బి ఫామ్ ఏనుగు రవీందర్ రెడ్డి కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కాటే పల్లి నగేష్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమావేశంలో యాత్కాపూర్ గ్రామ విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ యాదవ్, లింగాపూర్ అయూబ్ సాబ్, వాజిద్, యూత్ నాయకుడు సోహెల్, మల్లికార్జున, వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
