గౌరవ అధ్యక్షులుగా ముమ్మలనేని రాజా
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
ద్రోణ, బోధన్ జనవరి 1
తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తున్న బోధన్ కమ్మ సంఘం అధ్యక్షులుగా మూడోసారి ముచ్చటగా పళ్లెంపాటి శివన్నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కమ్మ సంఘం ఆవరణలో ప్రజాస్వామ్యబద్ధంగా సంఘ ఎన్నికలను సలహా కమిటీ సభ్యులు నిర్వహించారు. కటోర శ్రమకు తగ్గ ఫలితంగా సంఘ అభివృద్ధికి తోడ్పడుతున్న పెద్దలకు సముచిత గౌరవాన్ని సంఘ సభ్యులు నేడు అందించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రెండు పర్యాయాలు ఆయన సంఘ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి కష్ట , సుఖాలను, నష్టాలను తన భుజస్కందాలపై వేసుకొని సంఘ అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందించిన మహోన్నత వ్యక్తిగా కాకుండా ఓ శక్తివంతుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలను రాబట్టి సంఘ అభివృద్ధిని దినదినాభివృద్ధిగా కొనసాగిస్తున్నారు. సంఘం పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టడంతో పాటు పేద విద్యార్థులకు విద్యను వారికి హాస్టల్ సౌకర్యాన్ని కల్పించడం ఎంతో అభినందనీయం. నేడు బోధన్ కమ్మ సంఘం మాది అని గర్వంగా ఈ ప్రాంత కమ్మ సంఘం సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకునే పరిస్థితులు కల్పించిన ఘనత శివన్నారాయణ కే దక్కుతుంది. ఆయనతోపాటు వారి కార్యవర్గ సభ్యులు సంఘ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే నేడు మూడోసారి ముచ్చటగా శివన్నారాయణ అనుచర గణానికి సంఘ పట్టం కట్టారు. పదవులను పొంది పేరుకే పబ్బం గడుపుకునే రోజుల్లో, స్వార్ధాన్ని పక్కన పెట్టి, తన పూర్తి జీవిత ఆశయం కమ్మ సంఘం అభివృద్ధి లక్ష్యంగా ఎంచుకొని ప్రతినిత్యం సంఘ అభివృద్ధికి తపించడం ఎంతో అభినందనీయం. బోధన్ ప్రాంతంలోని కమ్మ సామాజిక వర్గం ప్రజలు ఆయన సేవకు పూల వర్షం కురిపించారు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన సంఘ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కి ఆయన తప్పితే ఏ ఒక్కరూ తాము ముందు ఉంటాం సంఘ బండిని నడపగలుగుతామని ముందుకు రాకపోవడం ఎంతో సంతోషదాయక విషయం. కమ్మ సామాజిక వర్గంలో ఆయన కన్నా రెట్టింపు ఆస్తిపాస్తులు పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ ఆయనతో పోటీపడి తమ శక్తి యుక్తులను సంఘ అభివృద్ధికి పోటీ పడటంలో తమలో ఎవరితో సాధ్యపడదని ముక్తకంఠంతో నినదించారు. కనీసం సంఘ ఎన్నికల్లో ఆయనతో పోటీపడేందుకు ఎవరు ముందుకు రాకపోవడంలో ఆయన యొక్క ఖచ్చితత్వం, నిస్వార్థంతో సంఘ అభివృద్ధికి పాటుపడడమే నిదర్శనం. మూడోసారి సంఘ అధ్యక్షులుగా శివన్నారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని కమ్మ సంఘం సభ్యులు మరింత బరువు బాధ్యతలను ఆయన భుజస్కందాలపై ఎత్తారు. బోధన్ కమ్మ సంఘం అభివృద్ధిలో మరింత దూసుకు వెళ్లి తెలంగాణ రాష్ట్రంలోనే కమ్మ సంఘాలకు ఆదర్శవంతంగా నిలుపుతారు అన్న దృఢ సంకల్పంతో సంఘ అధ్యక్షులను, వారి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఏకగ్రీవం తనపై మరింత బాధ్యతలను పెంచింది
బోధన్ కమ్మ సంఘం అధ్యక్షులుగా తనను మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం తనపై మరింత బాధ్యతలను పెంచిందని శివన్నారాయణ స్పష్టం చేశారు. కమ్మ సంఘ సభ్యులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘ అభివృద్ధికి తన షాయా శక్తుల కృషి చేస్తానని స్పష్టం చేశారు. సంఘ అభివృద్ధికి ఎంతోమంది తోడ్పాటును అందించారని వారి తోడ్పాటును మా సంఘం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పళ్లెంపాటి స్పష్టం చేశారు. ఈ సంఘ అభివృద్ధికి దాతలు ముందుకు రావడంతో పాటు, తనతోపాటు తన కార్యవర్గ సభ్యులు కృషి ఎంతగానో ఉందని, ఈ ప్రాంత కమ్మ సంఘ సభ్యులు సహకారంతోనే అభివృద్ధి పరచగలిగామని ఆయన అన్నారు. అందరి సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. ఆర్థికపరమైన అంశాలు ఎన్నో ఉన్నాయని, అటువంటి అంశాలను ఇప్పటికే తమ స్పష్టంగా చెప్పామని, దాతలు మరింత ముందుకు వచ్చి సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. సంఘ సభ్యులు, కుల పెద్దలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘ అభివృద్ధికి పాటుపడతామని, సంఘ సభ్యుల కష్టసుఖాల్లో ప్రతినిత్యం పాలుపంచుకుంటామని ఉపాధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి అన్నారు. కమ్మ సామాజిక వర్గం ఇప్పటికే అన్ని రంగాల్లో ముందున్నారని, మరిన్ని రంగాల్లో భవిష్యత్తులో రాణించాలని తన మనోభావాన్ని వ్యక్తం చేశారు.
అధ్యక్షులుగా శివన్నారాయణ , గౌరవ అధ్యక్షులుగా సంఘ అభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పాటును అందిస్తున్న సేవ దృక్పథలు ముమ్మల నేని రాజశేఖర్ ను నియమించుకున్నారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ వెనిగళ్ళ సునీల్ కుమార్ చౌదరి, గంగవరపు ఆదినారాయణ, వెలగ తిలక్, ప్రధాన కార్యదర్శిగా దావులూరి హరినాథ్ బాబు, కోశాధికారిగా శ్రీధర్, సంయుక్త కార్యదర్శులుగా ఎలవర్తి రవీంద్రబాబు, రెడ్డి వెంకటేశ్వరరావు, మద్దినేని శ్రీనివాసరావులను ఎన్నుకున్నారు.


