బోధన్ టౌన్ ద్రోణ:-ఈనెల 25వ తేదీన జరగనున్న జిల్లా మహాసభను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీ న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ హైదరాబాద్ చేగువేరా కామ్రేడ్ జార్జిరెడ్డి అమరత్వంతో, పిడి ఎస్ యు నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పుట్టిన గడ్డమీద 23వ మహాసభ (రాజీవ్ గాంధీ ఆడిటోరియం)లో బహిరంగ సభ, పాత కలెక్టరేట్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు విద్యార్థుల ప్రదర్శన ఉందని తెలిపారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్, కాంపాటి పృద్వి, ఎస్. అనిల్, పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా ఆహ్వానితులు అయ్యారు.

దేశంలో పేద విద్యార్థులకు అందరికీ ఉచిత, నాణ్యమైన విద్యను అందించాల్సిన కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి క్రమంగా తప్పుకుంటున్నారు నేటి ప్రభుత్వం విద్యా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ అందరికీ ఆమన్ విద్యా అందించాలని, శాస్త్రీయ విద్య సాధనకై, సమ సమాజ స్థాపనకై, గత 50 ఏళ్లుగా పి డి ఎస్ యు పోసేస్తుందన్నారు. విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నారు.
