కాలువలు, దారులు మూసివేత
భూములను కబ్జాలు చేయడం
పొతంగల్ ద్రోణ:-నూతనంగా ఏర్పడిన పొత్తంగల్ మండలంలోని జల్లాపల్లి గ్రామం శివారులో ఎంతోమందికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కి సంబంధించిన భూములను స్థానిక నిరుపేదలకు పంచి ఇవ్వడం జరిగింది. అక్కడ పైన ఉన్న ఎ క్లాస్ పూర్ గ్రామానికి చెందిన గంగు పటేల్ తో మాకు ఎలాంటి విరోధాలు కూడా లేవు అయినా భూమి ఆక్రమణకు పెద్దపీఠం వేస్తున్నాడు. సుమారు రెండు వందల ఎకరాలకు సంబంధించిన కాలువ నీరు రాకుండా, పూడ్చి వేసి గత పది రోజుల నుంచి నీరు రాకుండా అడ్డుకుంటున్నారని సంబంధిత శాఖ అధికారులకు చెప్పిన పది రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అక్కడ ఉన్న రైతులు మేము పంట ఎలా పండించాలో తెలియడం లేదని అధికారులు ఇంత నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు. ఎప్పుడో తీసుకోవలసిన చర్యలు ఇంతవరకు న్యాయం చేయలేదని రైతులు చెబుతున్నారు.
