బోధన్ టౌన్ ద్రోణ:-బోధన్ నియోజకవర్గంలోని మావంది కలన్ గ్రామంలో ఈరోజు గ్రామా పంచాయతీ లో ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఉచిత చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ లక్ష్మయ్య డ్వాక్రా మహిళలు మొత్తం యిరువై ఆరు(26) గ్రూపులు ఉండగా రేండు వందల అరవై ఐదు(265) మందికి చీరలు పంపిణీ చేశామని చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో ప్రోత్సహిస్తుందని ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో పోరా రెడ్డి, నాకు పటేల్, సుభాష్ పటేల్, శివ పటేల్, ఐకెపి అధ్యక్షురాలు గంగా సాగరి (వి ఓ ఏ), మండల సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
