పదవ తరగతి విద్యార్థి మూస ఉరేసుకుని ఆత్మహత్య
తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి

బోధన్ టౌన్ ద్రోణ:-
చందూరు మండలం గన్ పూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో (10)వ తరగతి చదువుతున్న విద్యార్థి షేక్ గౌస్, పద్నాలుగు (14) సంవత్సరాలు వసతి గృహంలోని గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పాఠశాల ప్రిన్సిపాల్ టి. నరేష్ కుమార్ తో పాటు వార్డెన్ ముజాహిల్ తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ లో ధర్మపురి హిల్స్ కు కాలానికి చెందిన షేక్ హమీద్ కుమారుడు షేక్ ముసాకు ఏడవ తరగతి చదువుతున్నప్పుడు ఈ వసతి గృహంలో చేర్పించినట్టు పేర్కొన్నారు. పోయిన శుక్రవారం నాడు తనకు చాతి నొప్పి ఉందని అదే విధంగా బర్త్ సర్టిఫికెట్ తేవాలని మృతుడు విద్యార్థి గౌస్ ఇంటికి వెళ్ళినట్టు తెలిపారు. ఇంటికి వెళ్లిన విద్యార్థి నిన్న అనగా ఆదివారం నాడు తన సోదరుడు సహకారంతో హాస్టల్ కు రావడం జరిగిందని అన్నారు. ఆదివారం సాయంత్రం చదువు క్లాసులు ముగిసిన తర్వాత విద్యార్థులు తమ రూమ్ కి వెళ్లడం జరిగిందని అన్నారు. రూమ్ లో ఉన్న విద్యార్థుల గదిలోకి సిబ్బంది రాత్రి పదకొండు (11) గంటల వరకు, పర్యవేక్షణ వేసి మాట్లాడడం జరిగిందని అన్నారు. సోమవారం ఉదయం మూడు (3) గంటల ప్రాంతంలో విద్యార్థి గదిలోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయినట్టు పేర్కొన్నారు.

ఈ విషయం విద్యార్థుల ద్వారా తెలుసుకొని వారి బంధువులకు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఐదు గంటల ముప్పై (30) నిమిషాల ప్రాంతంలో రావడం జరిగిందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నట్టు పేర్కొన్నారు. విద్యార్థి మృతికి కారణాలు ఇంకా ఏమీ తెలియ రాలేదు మొత్తానికి అనుమానస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందినట్లు తెలుస్తుంది.

వసతి గృహం ఎదుట పోలీసుల భారీ బందోబస్తు
మైనార్టీ వెల్ఫేర్ వసతి గృహం ఎదుట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న కేవలం మీడియా వారికి విద్యార్థుల తల్లిదండ్రులకు లోనికి ప్రవేశం కల్పించడం జరిగింది. విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో తరలి వచ్చి తమ తమ పిల్లలకు వచ్చి ధైర్యం చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటన జరగడంతో మిగతా విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రిన్సిపాల్ టి. నరేష్ కుమార్ తో పాటు మిగతా వారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. వారి అధ్వర్యంలో గేటు బయట పెద్ద ఎత్తున ఆందోళన పోలీసులపై తిరుగుబాటు పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలకు దిగారు.

ప్రిన్సిపాల్ నరేష్ కుమార్ వార్డెన్ కు పోలీసులు బందోబస్తు ఇస్తూ విషయం బయటికి రాకుండా చేయడం సిగ్గుచేటు అని విద్యార్థి సంఘాల మండిపాటు
విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, భారీ సంఖ్యలో తరలివచ్చి గేటు బయట ఆందోళన నిర్వహించారు, మృతి కి గల కారణాలు తెలుసుకోవడానికి విద్యార్థి సంఘ నాయకులు లోపటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయగా పోలీసులు వారిని లోపట పోనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులకు లోపాటికి ఆలో, చేయనీయకపోవడంతో పెద్ద ఎత్తున పోలీసులు డౌన్ డౌన్ అంటూ పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలుసుకోవడానికి తమకు లోనికి వెళ్ళనీయకపోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో 60 సీసీ కెమెరాలు పనిచేస్తలేవని వార్డెన్ అనడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క సీసీ కెమెరా ఎలా పనిచేయదని సీసీ కెమెరా లేకుండా వసతి గృహాన్ని ఎలా నడిపిస్తున్నారని వార్డెన్ తీరుపై పోలీసు తీరుపై విద్యార్థి సంఘం నాయకులు మంది పడ్డారు. నిన్నటి వరకు సీసీ కెమెరాలు అనగా మొత్తం 60 సీసీ కెమెరాలు పని చేస్తే విద్యార్థి మృతి చెందిన తర్వాత సీసీ కెమెరా పనిచేయకపోవడం ఏమిటని వార్డెన్ నిడదీశారు. జిల్లా కలెక్టర్ లేక బోధన్ సబ్ కలెక్టర్ ఇక్కడికి వచ్చి విద్యార్థి మృతికి కారణాలు తెలపాలని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరికలు చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి హమీద్ కు ఫోన్ లో వివరణ కోరగా ఇంట్లో కూడా ఏమీ గొడవ జరగలేదని ఎప్పుడు వెళ్లినట్టే హాస్టల్ కు వెళ్లడం జరిగిందని, తన కొడుకు ఏ విధంగా చనిపోయాడో ఇప్పటికీ తెలియడం లేదని పోలీసులకు ఫిర్యాదు ఇస్తామని, పోలీసుల తమకు న్యాయం చేయాలని తెలిపారు. ఏది ఏమైనా వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి గౌస్ ఉరేసుకొని చనిపోవడం అనుమానస్పదంగా ఉందని దీనిపై విచారణ చేపట్టి నిజానిజాలు బయటికి తీయాలని పలువురు కోరుతున్నారు.
