పాఠశాలకు తీరనున్న సమస్యలు
ఎడపల్లి ద్రోణ:-నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన (ఎన్ ఆర్ ఐ) ఏనుగు దయానంద రెడ్డి ఎడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి తన ఉదారత ను చాటి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.

తాసిల్దార్ దత్తాత్రి ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఆయన సుమారు 80,000 రూపాయల వ్యయం తో కుర్చీలు, మైక్ సెట్ పాఠశాలలో అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా అదే స్ఫూర్తితో పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ పాఠశాలలు అంటేనే నేడు మంచి అభిప్రాయం లేదని, ఇలాంటి సమయంలో దాతలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, మరియు మౌలిక వసతుల కల్పనకు చేయూత అందించాలని ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ పాఠశాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు గ్రామస్తులతో కలసి కట్టుగా ప్రభుత్వ పాఠశాలను తీరు మారినంత చేయూతను అందిస్తున్న పూర్వ విద్యార్థుల సహకారం మరువలేనిదని అన్నారు.

ప్రభుత్వమే కాకుండా గ్రామ ప్రజలు, పెద్దలు, ప్రతి ఒక్కరు, పాఠశాలకు చేయూతను అందివ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవికుమార్, ఉపాధ్యాయులు, గ్రామ కమిటీ, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
