Wednesday, February 11, 2026

బోధన్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, అభిషేకాలు సహస్రనామార్చన గణపతి హోమం తదితర పూజలు నిర్వహించారు. తదుపరి జగ్జీవన్ గురుస్వామి చే సిర్ప సుదర్శన్, మోత్కూరి సాయిలు గురుస్వాముల 18వ సంవత్సరం శబరిమల యాత్రను పురస్కరించుకొని వారికి రుషితుల్య పూజ, ఆవబృత స్నానము, దండ ప్రధానోత్సవం జరిగాయి. అనంతరం అయ్యప్ప స్వాములకు, భక్తులకు భిక్ష నిర్వహించారు. సాయంత్రం ఋషి తుల్యులకు సన్మానo చేశారు. తదుపరి అయ్యప్ప స్వామి పడిపూజ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ అధ్యక్షులు శివన్నారాయణ కార్యదర్శి చక్రవర్తి, కోశాధికారి కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular