బాకర్ ఫారంలో ఘనంగా వర్ధంతి వేడుకలు
నందమూరి తారక రామారావు ప్రజలకు ఎనలేని సేవలు అందించడంతో ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చిరస్మరణీయులుగా నిలిచిపోయారని గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు అన్నారు. గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ప్రజలకు చేతనైన కాడికి సేవలు అందిస్తే మనము ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవచ్చని సర్పంచ్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. మహిళలకు, బడుగు బలహీనవర్గాలకు, రిజర్వేషన్లు కల్పించి మేడారం రాజకీయంగా ఎదుగుదలకు కృషి చేశారన్నారు.పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపి రైతులకు పట్టేదారు పాస్బుక్కులను అందించిన ఘనత ఎన్టీఆర్ దక్కిందన్నారు. ఆనాడు రైతులు భూముల రికార్డులు సక్రంగా లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఎన్టీఆర్ తీసుకొచ్చిన మార్పులు సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలు ప్రపంచ ప్రజలలో గుర్తింపు తేవడం ఎంతో గర్వమన్నారు. సినీ రంగంలో పేరు ప్రఖ్యాతలు గడించడంతోపాటు రాజకీయాల్లో అరగేట్రం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఓ విప్లవాన్ని సృష్టించడం ఎంతో అభినందనీయమని ప్రజలు కొని ఆడారు. కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ లకు, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అధికారులకు, మెరుగైన సేవలు అందిస్తున్న పంచాయతీ సిబ్బంది సాయిలుకు పూల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, బాకర్ ఫారం సర్పంచ్ కనకమెడల శ్రీనివాసరావు, చేతన నగర్ సర్పంచ్ సునీల్, కార్యక్రమం సర్పంచ్ సునీల్ బాకర్ ఫారం ఉపసర్పంచ్ సంతోష్, కారేగం మాజీ ఉపసర్పంచ్ శివరాజ్ పటేల్, గ్రామ వార్డు సభ్యులు సత్యనారాయణ, ఉత్తం, కనకమెడల బాబురావు, మున్నంగి పూర్ణచంద్రరావు, మున్నంగి వినోద్ బాబు, వీరేశం పటేల్, బంటు సాయిలు, నగేష్, యాదవరావు, సుశిత్, జాస్తి నరసింహారావు, నల్లూరి ప్రభాకర్ రావు, మల్లాది రాంబాబు, సుంకర దత్తు, విద్యుత్ శాఖ అధికారులు రాజేష్, కనకమెడల వేణుగోపాలరావు, కనకమెడల చంద్రశేఖర్, ఇనుకుర్తి శ్రీనివాసరావు, జాస్తి రాజారావు, బంటు సాయలు, మెకానిక్ రాము, అమ్ములు వారు రాజేందర్ , వెలగపూడి హరిబాబు, చిట్టిబాబు, ప్రవీణ్, భరత్ , సుకృత్, కిలారు సురేష్ కుమార్ ,నగేష్ తోపాటు పలువురు పాల్గొన్నారు.











































































