ఖమ్మం జిల్లాకు భారీ పారిశ్రామిక పార్కును కేటాయించాలి
పాలేరు బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
నిజామాబాద్ బ్యూరో ద్రోణ జనవరి 18
సర్పంచ్ ఎన్నికల్లో 85% కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకొని రాష్ట్రానికి ఖమ్మం జిల్లా తలమానికంగా నిలిచింది రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులను కలిసి జిల్లాలో సాగునీటి పారుదల, విద్య, ఆరోగ్యానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే జేఎన్టీయూ విశ్వవిద్యాలయం బ్రాంచ్, నర్సింగ్ కళాశాల, సాగునీటిపారుదలలో భాగంగా మున్నేరును పాలేరుకు లింక్ చేయడం వంటి పనులు చేపట్టినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లాలో చదువుకున్న నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి ఉద్యోగాలు కల్పించడమే మిగిలింది భారీ పరిశ్రమలు జిల్లాకు వస్తేనే ఇది సాధ్యమని డిప్యూటీ సీఎం తెలిపారు. ఖమ్మం జిల్లాకు భారీ ఇండస్ట్రియల్ పార్కును కేటాయించాలని దాంతోపాటు ముఖ్యమైన ప్రాజెక్టులను జిల్లాకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం కోరారు.


