Wednesday, February 11, 2026

మహిళల అభ్యున్నతి పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యం

ద్రోణ బాన్సువాడ బ్యూరో జనవరి 19

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో బాన్సువాడ పట్టణ డ్వాక్రా మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల రాయితీ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు , బాన్సువాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి హాజరయ్యారు.బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 302 మహిళా సంఘాలకు 86 లక్షల 93 వేల రూపాయల వడ్డీలేని రుణ రాయితీ చెక్కును మహిళా సంఘాలకు పోచారం అందించారు.మహిళా సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంకొరకు హైదరాబాద్ నుండి కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాలను తన సొంత నిధులతో కొనుగోలు చేసి బాన్సువాడ పట్టణ డ్వాక్రా మహిళా సంఘాలకు పోచారం పంపిణీ చేశారు.పట్టణంలోని 4వ వార్డులో పర్యటించి ప్రజలను అడిగి వార్డు సమస్యలను తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో సమర్థవంతమైన, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకున్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
ఉదయం బీర్కూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకొని దేవస్థానానికి సంబంధించిన రెండు ఎకరాల భూమిలో యువకులు క్రీడలు ఆడుకునేందుకు కేంటాయించిన మైదానానికి భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మరియు బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular