పోలీస్ బాస్ పనితీరు భేష్
ద్రోణ, కోటగిరి, జనవరి 23
ఇప్పటికే ఎన్నో మార్లు రోడ్ల పరిస్థితి పై ఎంతో మంది నాయకులకు ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వం పనులు చేపట్టిన నిధులుf అందించడంలో చాలా నిర్లక్ష్యం చేస్తుందంటూ కాంట్రాక్టర్ ఎవరు వాళ్ళు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. చెక్పోస్ట్ నుండి కొల్లూరు వరకు రోడ్డు గుంటలమయంగా మారింది. ఇప్పటికే ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. ప్రజా ప్రతినిధులకు రోడ్ల విషయంలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఆర్ అండ్ బి శాఖ అయితే అసలు స్పందించరు. జిల్లాలో గుంతలు పడిన రోడ్లన్నీ పూడ్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు నిధులను విడుదల చేసింది. ఇట్టి పనులను ఓ మోతుబరి కాంట్రాక్టర్కు అప్పగించడం జరిగింది. వారు గత నెల రోజుల క్రితం హంగర్ గా ఫారం వరకు గుంతలను పూడ్చి చేతులు పైకి ఎత్తేశారు. కొల్లూరు వరకు ఉన్న గుంటలను లేకుండా చేయటం సంబంధిత రహదారులు భవనాల శాఖ అధికారులపై ఉన్నప్పటికీ వారు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మరమత్తు పనులను అప్పగించిన కాంట్రాక్టర్ పై ఇప్పటికైనా శాఖా పరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పోలీస్ బాస్ పనితీరు భేష్
కోటగిరి పోలీస్ స్టేషన్కు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సునీల్ తమకేమీ సంబంధం లేనప్పటికీ ఇప్పటికే రెండు మార్లు కంకర తెప్పించి గుంటలు పూడ్చడం పట్ల ప్రజలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. గత నెల రోజుల క్రితం కోటగిరి సమీపంలో ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అటువంటి సందర్భంలోనూ ఎటువంటి సంబంధం లేని పోలీస్ శాఖ అధికారి ఇట్టి పనులను చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం మరో టిప్పర్ కంకర తెప్పించి చెక్ పోస్ట్ సమీపంలోని బీర్కూర్ టర్నింగ్ వద్ద రహదారి పెద్ద లోయల మారింది. వెంటనే పోలీస్ అధికారి కంకర తెప్పించి గుంటలను పూడిపించడం ఎంతో అభినందనీయం. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కోటగిరి గారు రోడ్ల విషయంలో మరింత ముందు అడుగు వేస్తే బాగుంటుంది. హంగర్ గా ఫారం వరకు గుంటలను పూడ్చిన కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పాత రోడ్డు కన్నా ఎత్తుగా వేయడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మూడు రోజుల క్రితం సైతం గుంటలను తప్పించలేక 2 ద్విచక్ర వాహనదారులు ఒకరికొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. వారికి సైతం బలమైన గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. మా వద్ద నిధులు లేవని ఒకే ఒక సమాధానం వారు చెబుతారు ఫోన్ కట్ చేస్తారు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తుంది. అట్టి పనులను మాత్రమే తాము చేపట్టాల్సిన బాధ్యతగా వ్యవహరిస్తూ నటిస్తున్నారు. కొత్తగా రోడ్ల నిర్మిస్తే వారి వారి జేబుల్లోకి పెద్ద ఎత్తున నిధులు చేరుతున్నాయి అన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు మాత్రం ఏ ఒక్కరోజు ఇటువంటి రోడ్ల పరిస్థితి పై కన్నెత్తి చూడరు. కనీసం పూడ్చిన గుంటలు పరిస్థితి ఏ విధంగా ప్రమాదంగా ఉందో పరిశీలన జరిగితే బాగుంటుందని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
ఫోటో రైట్ అప్ చీకటి లో గుంటలను పూడ్చివేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్


