కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ 8 కోట్ల వ్యయం
ద్రోణ,నల్లగొండ చీఫ్ బ్యూరో, జనవరి 27
నల్లగొండ పట్టణంలోని చారిత్రక బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల పూర్తిగా పునర్నిర్మాణం చేపట్టారు.కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల గా ప్రారంభించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.8 కోట్ల వ్యయంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని ప్రపంచస్థాయి ఆధునిక సౌకర్యాలతో ఈ పాఠశాలను అభివృద్ధి చేశారు. విశాలమైన తరగతి గదులు, డిజిటల్ బోధనా సదుపాయాలు, గ్రంథాలయం, కార్యాచరణ గదులు, పిల్లలకు అనుకూలమైన మౌలిక వసతులతో పాటు, రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో వాల్డార్ఫ్ (Waldorf) విద్యా విధానం అమలు చేయడం ఈ పాఠశాల ప్రత్యేకత.ప్రభుత్వ పాఠశాలల ద్వారా కూడా నాణ్యమైన, విలువలతో కూడిన విద్య అందించాలన్న సంకల్పానికి బొట్టుగూడ పాఠశాల అభివృద్ధి ఒక కీలక ముందడుగు.కోమటిరెడ్డి ప్రతీక్ స్మృతిగా ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ విద్యా రంగంలో చేపట్టిన ఈ ప్రయత్నం, ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపనుంది.












