నగరానికి వరద ముంపు నుండి కాపాడుతాం
ఉప ముఖ్యమంత్రి
ద్రోణ, ఖమ్మం బ్యూరో, జనవరి 27
మధిర నగరాన్ని వరద ముప్పు నుంచి శాశ్వతంగా రక్షించే దిశగా కీలక అడుగు పడింది. వైరా నదిపై రూ. 65 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో వర్షాకాలంలో తరచుగా ఎదురయ్యే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. స్థానిక ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తుంది.ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తెలిపారు.

