Wednesday, February 11, 2026

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన అయేషా

సీనియర్ జర్నలిస్ట్ ఉమాకాంత్ గత కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురై మృతి చెందారు. వారి కుటుంబం వారిది ఎంతో నిరుపేద కుటుంబం. కుటుంబ పోషణ కూడా భారంగా మారడంతో వారి కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడుతున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి అయేషా ఫాతిమా మంగళవారం
ఉమాకాంత్ కుటుంబాన్ని పరామర్శించారు. ఉమాకాంత్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమాకాంత్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదు కుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఏరాజ్ పల్లి సర్పంచ్ దాస్ గౌడ్, ఉప సర్పంచ్ పవన్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు మరియు గ్రామస్తులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular