Wednesday, February 11, 2026

సమ్మక్క, సారలమ్మలను దర్షించుకున్న తెలంగాణ జాగృతి కవిత

ద్రోణ జనవరి 30 నిజామాబాద్ బ్యూరో

మేడారంలోని సమ్మక్క ,సారక్క లను దర్శించుకుని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.తెలంగాణ ప్రజలు బాగుండాలని సమ్మక్క, సారలమ్మలను కోరుకున్నారు.
కాకతీయుల వంటి రాజులతో కొట్లాడిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు.
వారి జాతి కోసం నిలబడి కొట్లాడిన వీరవనితలు అని కొని ఆడారు.గోవింద రాజు, పడిగిద్ద రాజుల వంశంలో గొప్ప సైనికులు. వారి స్ఫూర్తితోనే మేము తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు.తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అందని పరిస్థితి ఉంది.
సామాజిక న్యాయం అందరికీ ఇప్పటికీ దక్కలేదు. ఈ పరిస్థితి పోయేలా మేము జాగృతి తరఫున మా వంతు కృషి చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular