Friday, February 27, 2026

సేవాలాల్ మహారాజ్ సేవలు మరువలేము

ప్రభుత్వ సలహాదారు పోచారం

ద్రోణ, బాన్సువాడ ఫిబ్రవరి 27

సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలను మరువలేమని, గిరిజనులకు ఆయన ఆరాధ్య దైవం అని వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్స్ లో సేవాలాల్ మహారాజ్ 287 వ అధికారిక జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పోచారం హాజరయ్యారు.
ఉత్సవాల్లో ప్రధానమైన భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని బంజారా సంఘం నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గిరిజన సోదర సోదరీమణులందరికీ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.సేవలాల్ మహారాజ్ జన్మించింది బంజారా కుటుంబంలో అయినా అందరికి ఆదర్శంగా నిలిచారు, సేవలాల్ మహారాజ్ కారణజన్ములు, వారి సందేశం, బోధనలు, సూచనలు నాటికి, నేటికి అందరికీ ఆదర్శం, మనం అందరం ఆచరించాలి.
సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలు మరవలేనివి అని పోచారం పేర్కొన్నారు.
గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచే విదంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ , నియోజకవర్గ అన్ని మండలాల బంజారా సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular