ద్రోణ,నిజామాబాద్, ఏప్రిల్ 29
బోధన్ మండలంలోని బేలాల్ గ్రామంలో 200 కోట్ల అంచనాల వ్యయంతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం శంకుస్థాపన చేసారు.ఈ సందర్బంగా కలెక్టర్ మట్లాడుతూ తాను వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న స్థలం మంజూరు కావడం తన అదృష్టమని తెలిపారు. విద్యార్థులు ఈ గురుకుల పాఠశాలో చదువుకుని బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని అశిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అన్ని అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని కలెక్టర్ తెలిపారు. కాంట్రాక్టర్లు భవనాన్ని నాణ్యతతో నిర్మించాలన్నారు. విద్యార్థులను కలవడానికి వచ్చే తల్లిదండ్రులకు ప్రత్యేక వసతి భవనం నిర్మించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో మొదటి విడతలో గురుకుల పాఠశాల మంజూరు కావడం మన జిల్లాకు రావడం సంతోశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాకు పెద్ద పీటవేస్తుందన్నారు. జిల్లాలో 20 కోట్లతో పాఠశాలలో విద్యార్థుల కోసం మరుగుదోడ్లు నిర్మించుట జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యయులు మంచి విద్యాను అందిస్తున్నారని విద్యార్థులు బాగా చదువుకొని మంచి ర్యాంకులు సాదించాలన్నారు. 10వ తరగతి పరిక్షలలో 600 మార్కులకు గాను 587మార్కులు సాదించిన విజయసాయి విద్యార్థిని అభినందించారు. కెజీ నుండి 12 వరకు మంచి అవకాశమని తెలిపారు.
ఈ సమావేశంలో ఉర్దు అకాడమి చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ దిలిప్ కుమార్, ఆర్డిఓ రాజేందర్, మున్సిపల్ చైర్మన్, సర్పంచ్లు, సంబందిత అధికాలు పాల్గొన్నారు.






















