తనలాంటి ఎందరికో రాజకీయ భిక్ష
ఎమ్మెల్యే పోచారం
నిజామాబాద్,ద్రోణ మే 28
భారతదేశ రాజకీయాల్లోనే పేను మార్పులు, పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించి భారతదేశానికే ఆదర్శప్రాయాలుగా నిలిచారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి 6ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణంగా నిలిచాయన్నారు. తనలాంటి ఎందరో యువ నాయకులకు రాజకీయ బిక్ష అందించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కిందన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఎన్టీఆర్ 103 వ జయంతి వేడుకలను ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్టీఆర్ చేసిన సేవలను ఎన్నటికీ మర్చిపోలేర
న్నారు.
కోటి రూపాయలతో కళ్యాణ మండపం
కోటగిరి మండల కేంద్రంలోని రామాలయం ప్రాంగణంలో కోటి రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పోచారం మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంలో కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవడం అదృష్టంగా భావించాలన్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కళ్యాణ మండపంలో పేదలకు కళ్యాణాలు జరుపుకోవడానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కళ్యాణ మండపంలో కుర్చీలు, వంట సామాగ్రి అందించిన బిల్డర్ రాజశేఖర్ దంపతులను పోచారం అభినందించారు. బాన్స్వాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని తాను గర్వంగా చెప్పుతున్నానన్నారు. రాజకీయాలను ఎన్నికల వరకే వాడుకోవాలని ఎన్నికల అనంతరం రాజకీయాలను పక్కనపెట్టి నియోజకవర్గం అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ఈ ప్రాంత ప్రజలు తనకు 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందించడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తాను ప్రతినిత్యం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సమస్య ల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానన్నారు. ఎన్టీ రామారావు మహానటుడుగా ఉండి ఆనాటి రాజకీయ పరిస్థితులను జీర్ణించుకోలేక రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసి తొమ్మిది నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన ఘనత ఏకైక వ్యక్తి కే దేశంలో దక్కిందన్నారు. అధికారం రావడం ముఖ్యం కాదని ప్రజల జీవనశైలిలో, అభివృద్ధిలో మార్పు తేవడమే తను లక్ష్యంగా భావించి తెలుగు రాష్ట్రాలను నేడు భారతదేశ పటంలో ముందు ఉంచిన ఘనత ఆయనకే సాధ్యమైంది అన్నారు. తనలాంటి యువ నాయకులను ఎంతోమందిని ఆనాడు రాష్ట్రంలో ప్రోత్సహించి రాజకీయ బిక్ష ఎన్టీఆర్ పెట్టారన్నారు. ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తనలాంటివారు ప్రజలతో మమేకమై ప్రజాసేవలో ఆనాటి నుండి నేటి వరకు అదే ప్రక్రియలో కొనసాగుతున్నామన్నారు. తన నియోజకవర్గంలో విద్య, వైద్యం, రహదారులు, వ్యవసాయము, గృహ నిర్మాణ రంగంపై తాను ఆనాటి నుండి నేటి వరకు ప్రత్యేక శ్రద్ధతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగాను అన్నారు. తాను కాంట్రాక్టర్ గా పనిచేసే సమయంలో ఆనాటి కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు తన భుజం తట్టి తనను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రంలో ఎన్టీఆర్ తో రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు రావడం జరిగిందన్నారు. తనకు ఎన్టీఆర్ రాజకీయ బిక్ష పెట్టారన్నారు. ఆనాటి పరిస్థితుల్లో తనకు తెలుగుదేశం పార్టీ ఎన్నో పదవులను అందించిందన్నారు. తనను ఎంపీగా చేసి కేంద్రమంత్రి అవకాశం ఇప్పించాలన్న ఉద్దేశంతో తనకు ఆనాడు అవకాశం ఇచ్చారన్నారు. ఆనాటి పరిస్థితులతో ఓటెంపాలవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ తనకు తిరిగి ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో తనను నియోజకవర్గ ప్రజలు గెలిపించడం జరిగిందన్నారు. ఆనాటి భారీ మెజార్టీని స్ఫూర్తిగా తీసుకొని నేటి వరకు రాష్ట్రంలో తన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలపడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచాయ్ అన్నారు. పేదలకు సంక్షేమాలను అందించడం, వృద్ధులకు సహాయం చేయాలన్న ఆలోచన భారతదేశంలోనే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ మనసులోనే వచ్చిందన్నారు. ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలు అమలు చేశాయి అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా భారత దేశంలోనే రాజకీయాల్లో ఒక మంచి మలుపు తిప్పిన మహా వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో వచ్చిన రాజకీయ పరిస్థితుల్లో తాను కొన్ని పార్టీలు మారాల్సి వచ్చింది అన్నారు. అయినప్పటికీ తనను ఆదరించిన పార్టీలను ప్రజలను తాను ఎన్నటికీ మరువనన్నారు. తన నియోజకవర్గం ప్రతిరంగంలో ముందు ఉంచడమే తన అంతిమ లక్ష్యం అన్నారు. నేటి వరకు ప్రజల ఆశీస్సులతో, ప్రభుత్వాల సహకారంతో అన్ని రంగాలను అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం అధ్యక్షులు శివన్నారాయణ, బిల్డర్ రాజశేఖర్, దోప్పల పూడి శ్రీధర్, చౌదరి బాబు, వేములపల్లి కృష్ణారావు, బాధ్య నాయక్, స్థల దాతలు కీర్తిశేషులు మిక్కిలినేని ప్రసాద్ రావు కుటుంబ సభ్యులు, బర్ల మధు, వేములపల్లి ఆనంద్, నాయకులు శంకర్ పటేల్, పత్తి లక్ష్మణ్, కూచి సిద్దు, గంట్ల విటల్, కనక మేడల శ్రీనివాసరావు, సంతోష్, పుప్పాల శంకర్, గంగారాం, జగన్, షాజీ, సూర్యకాంత్, కొల్లి గాంధీ హమీద్, జుబేర్, హంగర్ గా గంగాధర్ , మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, కొట్టం మనోహర్, గంగాధర దేశాయ్, కృష్ణారెడ్డి, మోహన్ నాయక్, రంగబాబు పాటు పలు గ్రామాల ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







