Sunday, May 31, 2026

మురికి వాడలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

బోధన్, ద్రోణ మే 31

నిరుపేదల నివాసాలు ఉండే కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది.
బోధన్ పట్టణంలోని ఒకటో వార్డు ఆటోనగర్లో సిపిఐ సమావేశం నిర్వహించారు. సిపిఐ సీనియర్ నాయకులు నాగళ్ళ హనుమంతరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.పలువురు సిపిఐలో చేరారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ పట్టణ కార్యదర్శి రాధాకృష్ణన్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని మురికివాడల అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కృషి చేయాలని కోరారు.వర్షాకాలం సమీపిస్తున్నందున వార్డులలో రహదారులు మరియు మురికి కాలువలు లేక వర్షపు నీరు ఇండ్లలో చేరి దుర్గంధం వ్యాప్తి చెంది అనేక రోగాలకు దారితీస్తుందని వెంటనే మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. త్రాగునీరు, వీధిలైట్లు సౌకర్యం కల్పించాలని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, అనారోగ్యాలకు గురవుతున్న వారికోసం PHC లనుఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ బోధన్ మండల నాయకులు సాయిలు, రామకృష్ణ, పట్టణ నాయకులు కృష్ణ,సలీం,మన్నన్, అనంతరం సిపిఐ ఒకటవ వార్డు నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా సంతోష్ సహాయ కార్యదర్శిగా లక్ష్మణ్ ను ఎన్నుకున్నారు.సిపిఐ లో చేరిన వారిలో ఆలీ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular