Tuesday, July 21, 2026

బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

తన ఉదారతను చాటుకున్న పోచారం

నిజామాబాద్, ద్రోణ జూలై 20

బాన్సువాడ ఆసుపత్రిలో అస్వస్థతకు గురైన బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పోచారం శ్రీనివాసరెడ్డి వైద్యులకు సూచించారు. పోచారం తన ఉదాహరణ చాటుకుని అనారోగ్యానికి గురైన బాలింతలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
బాన్సువాడ మాత శిశు సంరక్షణ ఆసుపత్రిలో గత కొన్ని రోజుల క్రితం ఐదుగురు బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురైన వారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి మరింత విషమించడంతో నిజామాబాద్ నుండి నిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారిని బుధవారం నిమ్స్ ఆసుపత్రిలో వ్యవసాయ శాఖ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.
హైద‌రాబాద్ నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న హుమెరా ఫాతిమా (ఎల్లారెడ్డి), రుక్సనా ( కొత్తబాది, బాన్సువాడ మండలం), జ్యోతి గౌరారం ( గాంధారి మండలం), గార్ల ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసి, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించిన పోచారం.
హుమెరా ఫాతిమా, జ్యోతి ఆరోగ్యం నిలకడగా ఉందని, రుక్సనా కు డయాలసిస్ జరుగుతుందని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ పోచారం కి తెలిపారు .
చికిత్స పొందుతున్న ముగ్గురికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు చొప్పున 30 వేలు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులకు పోచారం అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular