బిచ్కుందను మరింత సుందరీకరిస్తాం
జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద పట్టణంలో కొనసాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు బుధవారం పరిశీలించారు.
బిచ్కుంద పట్టణాన్ని మరింత సుందరీకరిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో కాంట్రాక్టర్లు రాజీ పడవద్దని పనుల్లో లోపాలు ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని అధికారులను మరియు కాంట్రాక్టర్లను ఆదేశించారు.
