Tuesday, July 21, 2026

విద్యార్థులు విద్యతోపాటు ఇతర రంగాల్లో రాణించేట్లు చూడాలి

బోధన్, ద్రోణ జూలై 20

విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించేట్లు చూడాలని బోధన్ ఆర్డీవో సూచించారు.
బోధన్ ఆర్డీవో తహశీల్దార్ తో కలిసి, రాకాసిపేట లో హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్టడీ హాల్, కిచెన్, డైనింగ్ హాల్, టాయిలెట్ రూమ్ ల ను పరిశీలించారు. ఎటువంటి వసతులు ఉన్నాయో గమనించి హాస్టల్ పిల్లల ను అడిగి, సమస్యలను గురించి తెలుసుకున్నారు.
కొందరు పిల్లలను దగ్గర కు తీసుకొని, తరగతి గదుల్లో నేర్చుకున్న పాఠాలను గురించి అడిగారు, మార్కులను అడిగి తెలుసుకున్నారు, బాగా చదువుకొని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి అని ప్రోత్సహించారు.
ఒక బాలిక ను, “ఇంటి వద్ద బాగుందా లేక హాస్టల్ లో బాగుందా అని ప్రశ్నించగా” , ఆ ప్రైమరీ స్కూల్ బాలిక, హాస్టల్ లో ని బాగుంది అని నవ్వుతూ చెప్పిన సమాధానానికి, ఆర్డీవో, తహశీల్దార్ మరియు హాస్టల్ వార్డెన్ హర్షం వ్యక్తం చేశారు.
వార్డెన్ ల ను అడిగి, వసతులను సందర్శించి, తలెత్తుతున్న సమస్యలను గురించి తెలుసుకుని, స్టోర్ రూమ్ నందు గల సరుకులను, వండిన వంటకాలను, రీడింగ్ రూమ్, లైబ్రరీ, ప్రాంగణo, ఆటల వసతులు, కూరగాయలు, సరుకుల నాణ్యత, పుస్తకాలు, ఫ్యాన్ లు, లైట్ బల్బ్ లు, గురించి ఆరా తీశారు.
సమస్యలను తొందర్లోనే పరిశీలించాలి అని వార్డెన్ ల కు సూచనలు ఇచ్చారు. విద్యార్థులలో విద్యా తో పాటా, ఆట పాటలు, సాంస్కృతిక మరియు పోటీ తత్వం, మానసిక ఆరోగ్యం పెంపొందించే ల అడుగులు వేయాలి అని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular