Wednesday, July 22, 2026

రాహుల్ గాంధీ అరెస్ట్ అప్రజాస్వామికం

మంత్రి పొన్నం ప్రభాకర్

ఢిల్లీ, ద్రోణ జులై 20

జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
రాహుల్ గాంధీ ,మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ ఇతర ముఖ్య నేతల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జీ ఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి.నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.
నీట్ పేపర్ లీకేజీ కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్‌లో నీట్ పేపర్ లీకేజీ అంశంపై సమగ్ర చర్చ నిర్వహించి, వాస్తవాలను దేశ ప్రజలకు తెలియజేయాలి.
దేశ యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడే చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని మంత్రి పొన్నం హెచ్చరించారు.
విద్యార్థుల గొంతును అణచివేయడం కాదు, వారి సమస్యలకు పరిష్కారం చూపడమే ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను.
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కును హరించే చర్యలు దేశానికి మంచివి కామన్నారు.కేంద్ర ప్రభుత్వం నిర్బంధ రాజకీయాలను వీడి ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular