Sunday, September 27, 2026

పేకాటరాయుళ్లపై కోటగిరి పోలీసుల కొరడా

కోటగిరి, ద్రోణ జులై 20

కోటగిరి పోలీసులు పేకాట స్థావరాలపై, అక్రమ ఇసుక రవాణా పై కొరడా ఝళిపించారు. కోటగిరి ఎస్ఐగా నెలరోజుల క్రితం శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు తీసుకున్నారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ కోటగిరి ఉమ్మడి మండలంలో పట్టు సాధిస్తున్నారు. పేకాట స్థావరాలతో పాటు, అక్రమ విస్తరణదారులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. గురువారం కోటగిరి మండలం హంగర్గ ఫారం గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి 630 రూపాయలు, 9 సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular