Wednesday, August 5, 2026

విద్యార్థులకు బైకులు నిషేధించాలి

విద్యాసంస్థలదే బాధ్యత
హెచ్చరించిన పోలీసులు

పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యాలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులు సూచించారు.
బోధన్ పట్టణ సిఐ వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో విద్యాసంస్థల యాజమాన్యాలకు విద్యాసంస్థలకు వచ్చే విద్యార్థులు బైకులపై గాని స్కూటర్ల పైగా నీ రాకుండా ఉండేటట్లు చూడవలసిన బాధ్యత మీరు తీసుకోవాలని కోరారు. నిజామాబాదు నుండి విచ్చేసిన ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ మాట్లాడుతూ చట్టాలపై పూర్తి అవగాహనను యాజమాన్యాలకు కల్పించారు. విద్యార్థులు వాహనాలు వాడకుండా చూడాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. బోధన్ ఎసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను సమావేశపరిస్తే వారికి అవగాహన కల్పిస్తామని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. యాజమాన్యాల సంఘానికి జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆల్రెడీ తెలియజేస్తున్నామని సాయంత్రం విద్యార్థులు ఇళ్లకు వెళ్లే సమయంలో ఈవ్ టీజింగ్ కు కొంత మంది పాల్పడుతున్నారని వారిని అరికట్టవలసిందిగా కోరారు మైనారిటీ విద్యాసంస్థల అధ్యక్షుడు మాజీద్ మాట్లాడుతూ ఈ రకమైన అవగాహన సదస్సులు ప్రతి నెలకి ఒకసారి పెడితే బాగుంటుందని దానికి మేమందరం సహకరిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో సూర్య ప్రకాష్ ,శ్రీనివాస్, విజయ్ కుమార్, సురేష్ ,చిరంజీవి సుబ్బారావు, జావిద్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular