హైదరాబాద్ ఆగస్టు8
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు.ఇందులో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందచేయాలని నిర్ణయించారు.అదే సమయంలో, పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున ఆమె బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరు మీద బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
తద్వారా మొత్తంగా రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అందిస్తూ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని నిర్ణయించింది..
ఇంతటితోనే కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు, ఇతర కుటుంబ సంక్షేమ అంశాలకు సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని అధినేత కేసీఆర్ తెలిపారు.
