ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం
కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్‌కు శుభాకాంక్షలు..
బీఎస్ వీర్ శెట్టికి ప్రత్యేక సన్మానం
ఝరాసంగం, అక్టోబర్ 23(ద్రోణ) :- శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి డా. ఏ. చంద్రశేఖర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్‌తో పాటు పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీఎస్ వీర్ శెట్టిని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, పీసీసీ సభ్యులు శంకరయ్య స్వామి ప్రత్యేకంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్షద్ అలీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్, మాజీ మండల అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, హుగ్గెల్లి రాములు, భాస్కర్ రెడ్డి, సువర్ణ–మల్లన్న పాటిల్, పవన్ రాథోడ్, బడంపేట్ రాచన్న స్వామి ఆలయ కమిటీ చైర్మన్ జగదీష్ స్వామి, కాంగ్రెస్ నాయకులు ముల్తానీ, ఆలయ కమిటీ సభ్యులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
