Wednesday, October 21, 2026

తిర్మన్‌పల్లిలో కన్నుల పండువగా దుర్గమ్మ శోభాయాత్ర

భక్తి పారవశ్యంలో తిర్మన్‌పల్లి…

వైభవంగా దుర్గమ్మ ఊరేగింపు…

నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 21 (ద్రోణ):-
తిర్మన్‌పల్లి గ్రామంలో దుర్గా అమ్మవారి శోభాయాత్ర పది రోజుల పాటు కుంకుమార్చన పలు రకాల పూజలతో అమ్మవారిని మహిళలు, మాల వేసుకుని ఉన్న స్వాములు పూజల అను గ్రహం గ్రామంలోని ప్రతి ఒక్కరి పై ఉండాలని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర చేపట్టారు. గ్రామ వీధుల గుండా సాగిన ఈ యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిపూర్వకంగా మొక్కులు సమర్పించారు.

శోభాయాత్ర సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి నామస్మరణలు, భక్తుల జయ జయ ధ్వానాలతో గ్రామ వీధులు మార్మోగాయి. మహిళలు, యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. గ్రామంలోని ప్రతి గడప నుంచి అమ్మవారి అనుగ్రహం కోసం దీపారాధనతో మహిళలు ఉత్సాహంగా వీధుల గుండా అమ్మవారితో శోభాయాత్రలో పాల్గొన్నారు.

దుర్గమ్మ ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, గ్రామంలో శాంతి, సౌభాగ్యం, ఐకమత్యం వెల్లి విరియాలని భక్తులు ఆకాంక్షించారు. శోభాయాత్రతో తిర్మన్‌పల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ మెంబర్లు, గ్రామస్థులు పాల్గొని శాంతివంతంగా పూర్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular