ప్రజలందరి జీవితాల్లో సంతోషాల వెలుగులు నిండాలి!
విజయదశమి ప్రజల జీవితాల్లో విజయాలు నింపాలి
జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 19(ద్రోణ):- విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలు నింపాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఆకాంక్షించారు. దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు.

ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని, చేపట్టిన పనుల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐకమత్యం, సోదరభావం వెల్లివిరియాలని, అన్ని వర్గాల ప్రజలకు దసరా శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
