ఎమ్మెల్యే భూపతి రెడ్డితో భేటీ
బెటాలియన్ అభివృద్ధి, సిబ్బంది వసతులపై చర్చ
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఆహ్వానం
నిజామాబాద్, అక్టోబర్ 18(ద్రోణ):- డిచ్‌పల్లి కేంద్రంగా పనిచేస్తున్న 7వ బెటాలియన్ కమాండెంట్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి. సీతారాం ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కమాండెంట్ సీతారాం పూల మొక్కను అందజేసి తనను పరిచయం చేసుకున్నారు.

ఈ సందర్భంగా బెటాలియన్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పరిపాలనాపరమైన అంశాలు, పెండింగ్ బిల్లుల పరిష్కారం, సిబ్బందికి అవసరమైన మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. బెటాలియన్ అభివృద్ధికి అవసరమైన చర్యలపై చర్చించిన ఎమ్మెల్యే, కమాండెంట్‌గా అంకితభావంతో విధులు నిర్వహించాలని బి. సీతారాంకు సూచించారు.

అనంతరం ఈ నెల 21న 7వ బెటాలియన్‌లో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని కమాండెంట్ సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ డి. శ్రీనివాస్, ఆర్‌ఐలు త్రిముఖ్, నవనీత్, ఏఆర్ ఎస్‌ఐ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
