Monday, October 19, 2026

నూతన వ్యవసాయ సహాయ సంచాలకుడిగా అంజి ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ

ఎమ్మెల్యే డా. ఆర్‌. భూపతి రెడ్డిని

మర్యాదపూర్వకంగా కలిసిన అధికారి

నిజామాబాద్, అక్టోబర్‌ 18(ద్రోణ):- నిజామాబాద్ జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడి గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అంజి ప్రసాద్‌ ఆదివారం నిజామాబాద్‌ గ్రామీణ శాసనసభ్యుడు డా. ఆర్‌. భూపతి రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు పూల మొక్కను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్‌. భూపతి రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయ రంగంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పనిచేయాలని సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన అంజి ప్రసాద్‌ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు అర్హులైన రైతులకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి, జిల్లా వ్యవసాయ ప్రగతికి తోడ్పడాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గ ఆత్మా కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, ధర్పల్లి మండల వ్యవసాయ అధికారి వెంకటేష్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular