Monday, October 19, 2026

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి

నిజామాబాద్, అక్టోబర్ 18(ద్రోణ):- తెలంగాణ సంప్రదాయాలకు, పూల పండుగ వైభవానికి బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని గూపన్‌పల్లి గంగస్థాన్‌లో ఉన్న ఉత్తర తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

వేడుకల సందర్భంగా ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆ తర్వాత బతుకమ్మ సంబురాల్లో పాల్గొని మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని, ప్రకృతిపై ఉన్న ఆరాధనా భావాన్ని ప్రతిబింబిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి పూజించడం మన సంస్కృతిలోని ప్రత్యేకత అని తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఇలాంటి సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎమ్మెల్యే రాకతో దేవస్థాన ప్రాంగణంలో పండుగ సందడి నెలకొంది. స్థానిక నాయకులు, ఆలయ నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular