Friday, October 23, 2026

ప్రజల నమ్మకమే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం!

డబ్బుతో మనుషులను కొనలేం..

మనసులను మార్చలేం: ఎన్టీఆర్‌ ఆనాటి మాటలు నేటికీ స్ఫూర్తిదాయకం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలోనే పార్టీ నిర్వహణ, ఎన్నికల ఖర్చులపై ఎన్టీఆర్‌ తనదైన స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీ పేరును ప్రకటించిన రోజున ఓ విలేఖరి ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు అవసరమని, ఆ నిధులను ఎక్కడి నుంచి సేకరిస్తారని ప్రశ్నించారు. దీనికి ఎన్టీఆర్‌ స్పందిస్తూ.. “మనుషుల్ని డబ్బుతో కొనలేం. డబ్బుతో మనసుల్ని మార్చలేం. రాష్ట్రానికీ, సమాజానికీ మా వల్ల మంచి జరుగుతుందని నమ్మినవాళ్లే మాకు ఓటు వేస్తారు. ఎన్నికల ప్రచారమైనా అంతే” అని ప్రజలపై తనకున్న విశ్వాసాన్ని చాటిచెప్పారు.

ఈ సందర్భంగా కోయంబత్తూరులో జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. తాను పార్టీ స్థాపిస్తున్నట్లు తెలుసుకున్న ఓ అభిమాని తన కారును ఆపి హారతి ఇచ్చి, నూటొక్క రూపాయలు అందించాడని తెలిపారు. ఆ అభిమాని చూపిన అభిమానం తన మనసును కదిలించిందని పేర్కొన్నారు. “ప్రజలకు మంచి చేస్తున్నామనే నమ్మకం కలిగితే ప్రజలే పార్టీని పోషించుకుంటారు” అన్న ఎన్టీఆర్‌ మాటలు ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్రను, ప్రజాభిమానానికి ఉన్న విలువను చాటిచెబుతున్నాయి. ఎన్టీఆర్‌ వ్యక్తం చేసిన ప్రజా విశ్వాసమే తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో కీలకమైన అంశంగా నిలిచిందని ఆ పార్టీ అభిమానులు భావిస్తుంటారు. ప్రజల ఆదరణ, నాయకత్వంపై విశ్వాసం, ప్రజాసేవ పట్ల నిబద్ధతే ఏ రాజకీయ పార్టీకైనా అసలైన బలమనే సందేశాన్ని ఈ సంఘటన గుర్తుచేస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular