స్కార్పియో వాహనంలో రహస్య అరలో

బంగారం,డాలర్లు, యూరోల గుర్తింపు
విజయవాడ, అక్టోబర్ 22,(ద్రోణ):- శివార్ లలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీగా బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.5.84 కోట్ల విలువైన సొత్తును పట్టుకున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న స్కార్పియో వాహనాన్ని ఆపి పరిశీలించగా, అందులోని రహస్యంగా అరలో బంగారం, 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలు లభించినట్లు సమాచారం.
స్వాధీనం చేసుకున్న బంగారం, విదేశీ కరెన్సీ విలువ మొత్తం రూ.5.84 కోట్లుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం.
